రోడ్డు పక్కన తోపుడుబండిపై కూరగాయలు, పండ్లు అమ్ముకునే రైసా అన్సారి అనే ఓ యువతిని ( Vegetables vendor ) అక్కడి నుంచి ఖాళీ చేయాల్సిందిగా మునిసిపల్ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. '' తాము చేసుకునేదే చిరు వ్యాపారం.. అది కూడా అడ్డుకుంటే ఇక మేం బతకడం ఎలా'' అని ఆగ్రహించిన ఆ యువతికి కోపం నషాళానికెక్కింది. ఇంకేం... అడ్డొచ్చిన అధికారులకు ఇంగ్లీష్‌లో క్లాస్ ఇచ్చుకుంది ( Spoken in english ). తోపుడుబండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపారులపైననా మీ ప్రతాపం అంటూ అధికారులకు ఇంగ్లీష్‌లో లెక్చర్ ఇచ్చింది. తన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ వారిని నిలదీసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీలో ( Indore ) చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( Also read: Rajastan Crisis: అశోక్ గెహ్లట్ చెప్పేదంతా అబద్దం )
అధికారులపై యువతి నిరసన తెలుపుతున్న వైనాన్ని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా సిబ్బంది ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతున్న తీరుపై ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ ఏం చదువుకున్నావమ్మా అని అడిగితే అసలు విషయం తెలిసింది... ఆమె ఓ పీహెచ్‌డి గ్రాడ్యూయేట్ ( Phd graduate ) అని. అవును.. మెటీరియల్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసినప్పటికీ.. ఉరుకులు, పరగుల జీవితాలతో గడిచిపోయే ప్రైవేటు ఉద్యోగాలపై ( Private jobs ) ఇష్టం లేక ఇలా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానంటోంది. ఉద్యోగం కోసం ఎందుకు ప్రయత్నించలేదు అని అడిగితే.. అసలు ఉద్యోగం ఇచ్చే వాళ్లు ఎవరున్నారని విస్మయం వ్యక్తంచేసింది. రైసా అన్సారీ ఏమేం చెప్పిందో ఆమె మాటల్లోనే వినండి. ( Also read: Sony ZV-1: సోని నుంచి పాకెట్ సైజ్ డిజిటల్ కెమెరా.. ధర ఎంతో తెలుసా ? )