Telangana: 24 గంటల్లో 1640 కరోనా కేసులు

తెలంగాణలో శుక్రవారం 15,445 మందికి కరోనావైరస్ పరీక్షలు చేయగా.. 1640 మందికి కరోనావైరస్ పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ఇందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 683 కేసులు నమోదయ్యాయి.

Last Updated : Jul 25, 2020, 04:43 AM IST
Telangana: 24 గంటల్లో 1640 కరోనా కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణలో శుక్రవారం 15,445 మందికి  కరోనావైరస్ పరీక్షలు చేయగా.. 1640 మందికి కరోనావైరస్ పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ఇందులో  జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 683 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య 52,466 మందికి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనావైరస్ కారణంగా 8 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య మొత్తం 455 కు చేరింది. ( Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు ) 

నేడు రాష్ట్ర వ్యాప్తంగా 445 మంది  కరోనావైరస్ నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. అలా ఇప్పటివరకు మొత్తం 40,334 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని కొవిడ్-19 ఆస్పత్రులలో కలిపి 11,677 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ( Also read: Health tips: వేపాకుతో ఇన్ని లాభాలు, ప్రయోజనాలా ? )

Trending News