వీడియో షేరింగ్ యాప్, చైనాకు చెందిన టిక్‌టాక్‌ (TikTok Ban In US)పై అమెరికాలో నిషేధంపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇచ్చిన గడువులోగా తమ దేశ కంపెనీలకు టిక్‌టాక్‌(TikTok)ను విక్రయించాలని.. లేకపోతే కంపెనీ మూసుకోవాలని హెచ్చరికలు జారీ చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో వారం గడువు పొడిగించారు. ఒక్కరోజు కూడా గడువు పొడిగించేది లేదని పలుమార్లు ప్రస్తావించిన ట్రంప్ తన మనసు మార్చుకున్నారు.  MSK Prasad Trolls: అంబటి రాయుడు అదరహో.. ఎమ్మెస్కే ప్రసాద్‌పై 3D రేంజ్‌లో ట్రోలింగ్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టిక్‌టాక్ బ్యాన్ సెప్టెంబర్ 27నుంచి అమల్లోకి రానుందని అమెరికా వాణిజ్య విభాగం వెల్లడించింది. తొలుత నిర్ణయించిన దాని ప్రకారం నేటి నుంచి అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం అమల్లోకి రావాల్సి ఉంది. ఒరాకిల్, వాల్‌మార్ట్ లాంటి దిగ్గజ సంస్థలు టిక్‌టాక్‌ వాటాను కొనుగోలు చేయనున్నాయని సమాచారం ఇచ్చిన నేపథ్యంలో తుది ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు మరో వారం గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. ధోనీ మార్క్ పంచ్ పేలింది.. Dhoni Is Back అంటున్న ఫ్యాన్స్ 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR