Tornado Effect: అమెరికాలో టోర్నడో భీభత్సం సృష్టించింది. అత్యంత భయంకరమైన టోర్నడో ప్రభావానికి ఇళ్లు, పైకప్పులు ఎగిరిపోయాయి. అతి తీవ్రతుపాను ప్రభావంతో మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూఎస్ఏలో పెను విపత్తు విరుచుకుపడింది. అమెరికాలోని పలు రాష్ట్రాల్ని బెంబేలెత్తించింది. భారీ వర్షాలకు తోడు..బలమైన ఈదురు గాలులు పెను రాకాసిలా విరుచుకుపడ్డాయి. అదే టోర్నడో(Tornado). అమెరికాలో తరచూ ఎదురయ్యే టోర్నడో విపత్తు ఈసారి గట్టిగా తాకింది. ముఖ్యంగా కెంటకీ రాష్ట్రంలో పరిస్థితి అత్యంత భయంకరంగా మారింది. చరిత్రలో ఇదే అత్యంత తీవ్రమైన తుపానుగా పరిగణిస్తున్నారు. సుడిగాలుల భీభత్సానికి అన్నీ కొట్టుకుుపోయాయి. 


ఇళ్ల పైకప్పులు, ఫ్యాక్టరీలు, కార్యాలయాలు అన్నీ ధ్వంసమైపోయాయి. కొన్ని ఇళ్లైతే గాలుల భీభత్సానికి ఎగిరిపోయాయి. మేఫీల్డ్ నగరంలోని ఓ క్యాండిల్ ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమై...110 మంది శిధిలాల్లో చిక్కుకుపోయారు. వీరిలో 70 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. మొత్తం రాష్ట్రంలో మరణించివారి సంఖ్య వందకు పైగా ఉండవచ్చని సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించారు. టోర్నడో ప్రభావం ఏకంగా 227 మైళ్ల మేర కన్పించింది. మరోవైపు ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ఎడ్వర్డ్స్ విల్లేలోని అమెజాన్ గోడౌన్ ధ్వంసమైంది. ధ్వంసమైన సమయంలో గోడౌన్ లో వందిమంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎంతమంది క్షేమంగా ఉన్నారు, ఎంతమంది చనిపోయారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అటు అర్కాన్సస్ రాష్ట్రంలో కూడా పరిస్థితి తీవ్రంగా ఉంది. నర్శింగ్ హోమ్ ధ్వంసమై..20 మంది చిక్కుకుపోయారు. టెన్నెస్సీ రాష్ట్రంలో టోర్నడో కారణంగా ముగ్గురు మరణించారు. మరోవైపు టోర్నోడో ప్రభావంపై అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden)స్పందించారు. అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. టోర్నడో ప్రభావిత రాష్ట్రాలకు తక్షణం సహాయం అందిస్తామన్నారు. సహాయక చర్యల్ని వేగవంతం చేశారు. 


Also read; Omicron : అక్కడ వేగంగా పెరుగుతోన్న ఒమిక్రాన్, ఒక్కరోజులోనే రెట్టింపు అయిన కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook