Earthquake in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత శనివారం రాత్రి 9:30 గంటలకు ఢిల్లీ, దాని సమీప ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ సరిహద్దుల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి, శ్రీనగర్, గుల్‌మార్గ్‌తో పాటు మాతా వైష్ణో దేవి మందిరం యొక్క బేస్ క్యాంప్ అయిన కత్రా ప్రాంతం, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్ మరియు ఇతర పాకిస్తాన్ నగరాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలోని ఉత్తరం వైపు 36.38 ఆక్షాంశంలో,  70.77 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద 196 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి లేదా ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. “"రాత్రి 9:30 గంటలకు రెండుసార్లు భూమి కంపించిందని" అని నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటటున్న ప్రీతి శంకర్ చెప్పింది. అఫ్ఘనిస్తాన్లో తరచు భూకంపాలు సంభవిస్తాయి.  ముఖ్యంగా హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో యురేషియన్, ఇండియన్ టెక్టోనిక్ ఫలకాల మధ్య రాపిడి తలెత్తి భూకంపాలకు కారణమవుతున్నాయి. 


Also Read: Vande Bharat Express Trains: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందేభారత్ రైళ్లు, ఆగస్టు 15నే ప్రారంభం, ఎక్కడెక్కడంటే


జమ్మూకశ్మీర్‌ భూప్రకంపనలతో వణికిపోయింది. శనివారం ఒక్క రోజే ఏకంగా మూడు సార్లు భూమి కంపించింది. జమ్మూకశ్మీర్‌లో మొదటి భూకంపం ఉదయం 8.36 గంటలకు 129 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. రిక్టర్‌ స్కేల్‌పై 4.8 తీవ్రతగా నమోదైంది.  ఇక రెండో భూకంపం రాత్రి 10.24 గంటలకు సంభవించింది. ఈ భూకంప కేంద్రం కాబూల్‌కు ఈశాన్యంగా 75 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఇది రిక్టర్‌ స్కేల్‌పై 5.2గా రికార్డయింది. రెండు రోజుల కిందట అంటే గురువారం తెల్లవారుజామున అండమాన్ మరియు నికోబార్ దీవులలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.


Also Read: Stalin vs Amit Shah: హిందీపై మళ్లీ వివాదం, హిందీకి బానిసలు కాబోమని స్టాలిన్ ట్వీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook