Mexico truck accident: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ భారీ ట్రక్కు ఫుట్​పాత్ రేలింగ్​ను ఢీ కొట్టి బోల్తా పడింది.  ఈ ప్రమాదంలో ట్రక్కులో (Mexico truck Accident death toll) ఉన్న 53 మంది మృతి చెందారు. మృతులంతా అమెరికాకు అక్రమంగా వలస వెళ్తున్నవారిగా గుర్తించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాదం జరిగిందిలా..


చియాపాస్ రాష్ట్రంలోని టక్స్​ట్లా గుటిరెజ్ నగర శివార్లలో.. ఈ ప్రమాదం (Mexico truck accident) జరిగింది. ఈ ఘటనలో డజనల్ల కొద్ది జనాలకు గాయాలయ్యాయి. ట్రక్కు అతివేగంగా ప్రయాణిస్తుండటం, ఓవర్​లోడ్ సహా.. రోడ్డు వంపును డ్రైవర్​ సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానిక (Road accident in Mexico) అధికారులు తెలిపారు.


తాజాగా ప్రమాదానికి గురైన ట్రక్కులో 100 మందికిపైనే ఉంటారని అధికారకులు అంచనా వేస్తున్నారు.


ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక సిబ్బంది హాస్పిటల్​కు తరలించారు.


మెక్సికో గుండా అమెరికాకు అక్రమంగా వలస వెళ్లడం సాధారణంగా జరుగుతుంది. ఇందుకోసమే ట్రక్కుల వంటి వాటిలో వలసదారులు ప్రమాదకరంగా ప్రయాణిస్తుంటారు. ఎలాగైనా దేశాన్ని దాటాలనే ఉద్దేశంతో చాలా మంది ఇలా తమ ప్రాణాలను ప్రమాదంలో పెడుతుంటారు.


మెక్సికో అధికారులు గరత నెలలో 600 మందితో అక్రమ వలసదారులను పట్టుకున్నారు. వారంతా ట్రక్కుల్లో మెక్సికో బార్డర్ దాటేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు.


ప్రతి ఏటా కొన్ని వందల మంది అమెరికా-మెక్సికో బార్డర్లలో పట్టుబడుతుంటారు.


Also read: Facebook Donation: పరిశోధనలకై మార్క్ జుకర్‌బర్గ్ భారీ విరాళం, ఏకంగా 2 లక్షల 50 వేల కోట్లు


Also read: Faisalabad Incident Video: పాకిస్తాన్ లో వివస్త్రలను చేసి నలుగురు మహిళలపై దాడి.. వార్తల్లో నిజమెంత?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook