న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ సమయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చేధు అనుభవం ఎదురైంది. పాక్ జర్నలిస్ట్ గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ.. ఇలాంటి వారిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారంటూ ట్రంప్ నేరుగా ఇమ్రాన్ ఖాన్ ను ప్రశ్నించారు . ట్రంప్ వ్యాఖ్యలతో ఇమ్రాన్ ఖాన్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అసలు ఏం జరిగిందనేది డీటైల్ గా తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రత్యేకంగా సమావేశమ్యారు. భేటీ ముగిసిన వెంటనే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ట్రంప్ కు పాక్ కు చెందిన ఓ జర్నలిస్టు విసుగెత్తించే ప్రశ్నలు వేశాడు. ఈ క్రమంలో కశ్మీర్ అంశంపై మీ వైఖరి ఏంటి అంటూ  ట్రంప్ ను పదేపదే ప్రశ్నించాడు. దీంతో అసహనానికి లోనైన ట్రంప్.. సదురు జర్నలిస్టుపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. వేలు ఇమాన్ ఖాన్ వైపు చూపుతూ నీవు ఆయన టీమ్ కు చెందిన వ్యక్తివా ? అని ప్రశ్నించారు. ఇంతటితో ట్రంప్ ఆగకుండా డైరక్ట్ గా ఇమ్రాన్ ఖాన్ తో ఇలాంటి ...వారిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇమ్రాన్ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇమ్రాన్ తడబడ్డారు . ట్రంప్ రియాక్షన్ తో పాక్ ప్రధాని ముఖం ఒక్కసారిగా ఎర్రబారింది. 


ఇప్పటికే అనేక వేదికలగా కశ్మీర్ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని ట్రంప్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. భారత్ - పాక్ మధ్య శాంతియుత వాతావారణాన్ని విషయంలో తమ సాయం అందిస్తామన్నారు తప్పితే కశ్మీర్ అంశాన్ని ఆయన ఎక్కడా ప్రస్తావించడం లేదు. అయితే ఇప్పుడు  పాక్ జర్నిలిస్ట్ పదే పదే ఇలా కశ్మీర్ పై స్పందించాలని ప్రశ్నించడంతో ట్రంప్ ఈ మేరకు అసహనాన్ని ప్రదర్శించారు.