ఐరాసకు షాక్ ఇచ్చిన ట్రంప్..!
యునెస్కో (యూనైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనేజేషన్) నుండి ఆశ్చర్యకరమైన రీతిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనల మేరకు ఆ దేశ ప్రభుత్వం నిష్క్రమించింది. ఇజ్రాయెల్ వ్యతిరేకతను యునెస్కో కొనసాగిస్తుండటంపై నిరసన వ్యక్తం చేస్తూ, ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పరిశీలకుడి పాత్రను పోషించడానికి తమకు అభ్యంతరం లేదని అమెరికా ప్రభుత్వం తెలిపింది. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపింది. యునెస్కోలో సంస్కరణాపరమైన విధానాలు రూపుదిద్దుకోవాలని పిలుపునిచ్చింది. మరోవైపు ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేక ధోరణిని యునెస్కో కొనసాగిస్తోందని ఆరోపించింది. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లాంటి అంశాలపై అంశాలపై అమెరికా సూచనలను అందజేసేందుకు వీలుగా పరిశీలక హోదాలో మాత్రమే ఉండాలని తాము కోరుకుంటున్నామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.