తెలంగాణలో డోనాల్డ్ ట్రంప్ విగ్రహం..!!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్రంప్ చేష్టల కారణంగా .. ఆయన్ను బహిరంగంగానే ద్వేషించే చాలా మందిని మనం చూశాం. కానీ ఆయనకు వీరాభిమానులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్రంప్ చేష్టల కారణంగా .. ఆయన్ను బహిరంగంగానే ద్వేషించే చాలా మందిని మనం చూశాం. కానీ ఆయనకు వీరాభిమానులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ పై ఎంత వీరాభిమానం అంటే .. ఆయనకు ఏకంగా విగ్రహం నిర్మించి కొలిచేంతగా..!! మరి అలాంటి వీరాభిమానిని మీరు ఎప్పుడైనా చూశారా..? ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వీరాభిమాని ఎక్కడో లేడు. మన మధ్యే ఉన్నాడు. అదీ తెలంగాణలో. అవును.. జనగామ జిల్లా బుస్స కృష్ణ అనే యువకుడు .. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు వీరాభిమాని.
[[{"fid":"182163","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఆయన విగ్రహాన్ని నిర్మించి రోజూ పూజ చేస్తున్నాడు. తాను ట్రంప్ ను భగవంతునిగా నమ్ముతానని బుస్స కృష్ణ తెలిపాడు. ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా ట్రంప్ కు పూజ చేసిన తర్వాతే తాను పని ప్రారంభిస్తానని చెబుతున్నాడు. ప్రతి శుక్రవారం ట్రంప్ .. ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేస్తానని ఆ రోజు ఉపవాసం కూడా ఉంటానని తెలిపాడు.
See Pics: అందాల గేట్లు ఎత్తేసిన భామలు
[[{"fid":"182164","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
బుస్స కృష్ణ .. నిర్మించిన ట్రంప్ విగ్రహం 6 అడుగులు ఉంది. దాన్ని నిర్మించేందుకు 15 మంది కూలీలు ఒక నెల రోజులపాటు శ్రమించారు. ట్రంప్ పై వీరాభిమానంతో పూజలు చేస్తున్న బుస్స కృష్ణను .. ఆయన గ్రామస్తులు, స్నేహితులు అంతా ట్రంప్ కృష్ణ అని పిలవడం విశేషం. గ్రామస్తులు కూడా ట్రంప్ కృష్ణ .. వీరాభిమానాన్ని మెచ్చుకుంటున్నారు.
[[{"fid":"182165","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియా ట్రంప్ తో కలిసి .. ఈ నెల 24, 25న భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మన ట్రంప్ కృష్ణ .. డోనాల్డ్ ట్రంప్ తో కలిసే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.