Turkey Syria Earthquake: టర్కీ, సిరియాలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. 5 వేలకు పైనే మరణాలు!
Earthquake 2023 Death toll passes 5000 in Turkey and Syria. వరుస భూకంపాల కారణంగా ఇప్పటివరకు టర్కీ, సిరియాలో 5 వేల మందికి పైగా మృతిచెందినట్లు మీడియా సంస్థలు తెలిపాయి.
Earthquake 2023 Death toll passes 5000 in Turkey and Syria: టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.8గా నమోదైంది. మూడు సార్లు భారీ భూకంపం అనంతరం.. ప్రకంపనలు కొనసాగాయి. రిక్టర్ స్కేల్‌పై 4 కంటే ఎక్కువ స్థాయిలో 100 సార్లకు పైగా భూమి కంపించింది. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. భవిష్యత్తులో కూడా 5 నుంచి 6 తీవ్రతతో మరికొంతకాలం ఈ ప్రకంపనలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.
టర్కీ, సిరియా దేశాల్లో ప్రకృతి సృష్టించిన ఘోర విపత్తుకు భారీగా భవనాలు నేలమట్టం అయ్యాయి. మరోవైపు విద్యుత్తు వ్యవస్థ, సహజ వాయు పైపు లైన్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరుస భూకంపాల కారణంగా ఇప్పటివరకు రెండు దేశాల్లో 5 వేల మందికి పైగా మృతిచెందినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. మరోవైపు వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇక శిథిలాల కింద చిక్కుకున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. గాయపడ్డవారిని ఇప్పటికీ బయటికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత భారీగా నమోదయ్యే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
టర్కీలో ఇప్పటివరకు దాదాపుగా 4వేల మందికి పైగా మృతి చెందినట్లు ఆ దేశ సహాయక సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. సిరియాలో మరో 1500 మందికి పైనే ప్రాణాలు కోల్పోయారట. మొత్తంగా రెండు దేశాల్లో కలిపి 5వేల మందికి పైగా మరణించినట్లు తెలిపింది. టర్కీలో 20వేల మందికి పైగా గాయపడగా.. చాలామంది ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సిరియాలో 2 వేలకు మందికి పైగా గాయపడ్డారు.
Also Read: Virat Kohli Lost Phone: ఫోన్ పోగొట్టుకున్న విరాట్ కోహ్లీ.. అనుష్క ఫోన్ నుంచి ఆర్డర్ చేయమన్న జొమాటో!
Aslo Read: రూ. 26 లక్షలకే టయోటా ఫార్చ్యూనర్.. రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.