టర్కీ, సిరియా దేశాల్లో ఒకేరోజు మూడుసార్లు కంపించిన భూమి..భారీ విధ్వంసమే సృష్టించింది. ఘోర భూకంపంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అమెరికా జియోలాజికల్ సర్వే అంచనాలు నిజమౌతున్నాయి. ఇప్పటికీ మృతుల సంఖ్య 8 వేలు దాటేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టర్కీ, సిరియా దేశాల్లో ఎక్కడ చూసినా శిధిలాలే కన్పిస్తున్నాయి. ఆ శిధిలాల కింద నలిగి తనువు చాలించిన జీవితాలు కంట నీరు పెట్టిస్తున్నాయి. భూకంపం సృష్టించిన ఘోర ఉపద్రవంతో భారీగా జననష్టం, ఆస్థినష్టం, ధననష్టం. ఒక్కొక్క శిధిలాల్ని కదిలిస్తే ఎన్నెన్నో శవాలు..ఒక్కొక్క మనిషికి కదిపితే మరెన్నో దీనగాధలు. వేలాది భవనాలు నేలకూలడంతో శిధిలాల తొలగింపు కష్టతరమౌతోంది. శిధిలాల కింద చిక్కుకుని కొన ఊపిరితో కాపాడమంటూ చేస్తున్న ఆక్రందనలు కలచివేస్తున్నాయి. వరుసగా రెండవరోజు అంటే ఫిబ్రవరి 7వ తేదీన కూడా టర్కీ, సిరియా దేశాల్లో భూ ప్రకంపనలు కొనసాగాయి.


టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం కారణంగా ఇప్పటి వరకూ 8వేల మంది మరణించారు. ఈ సంఖ్య అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం 10 వేల ఉండవచ్చని అంచనా. ఇప్పటికే 50 వేలమంది గాయపడ్డారు. టర్కీలో అత్యధికంగా 5,894 మంది మరణించగా, సిరియాలో 1900 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క టర్కీలోనే 6 వేల భవనాలు నేలమట్టమైనట్టు సమాచారం. పెద్ద పెద్ద భవనాల కాంక్రీట్ స్లాబులు అమాంతం కూలిపోవడంతో వాటి కింద చాలామంది చిక్కుకుపోయారు. ఆ కాంక్రీట్ స్లాబుల్ని తొలగించే పరికరాలు టర్కీ, సిరియా దేశాల్లో స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతోంది.


మరోవైపు శిధిలాల తొలగింపు పూర్తయితే..మరణాల సంఖ్య 20 వేలకు చేరవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. భూకంపం కారణంగా..టర్కీ, సిరియా దేశాల భూకంపంతో 2.5 కోట్లమంది ప్రభావితమై ఉంటాని తెలుస్తోంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని టర్కీలోని 10 ప్రావిన్స్‌లలో మూడు నెలలు ఎమర్జెన్సీ ప్రకటించారు. టర్కీ సిరియా దేశాలకు అండగా నిలిచేందుకు ఐక్యరాజ్యసమితి సహా పలుదేశాలు ముందుకొచ్చాయి. ఇండియా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని పంపించడమే కాకుండా..ఎక్స్‌రే, వెంటిలేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు, కార్డియాక్ మానిటర్లను అందజేసింది. 


Also read: Pakistan Accident: పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం...30 మంది దుర్మరణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook