Twitter permanently suspends Donald Trump's account | వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ట్విట్టర్‌ షాక్‌ ఇచ్చింది. ట్రంప్‌ ట్విట్టర్ అకౌంట్‌ను శాశ్వతంగా నిషేధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఇటీవల చేసిన ట్వీట్లను నిశితంగా పరిశీలించిన తర్వాత హింసను మరింత ప్రేరేపించే ప్రమాదం ఉన్నందున అకౌంట్‌ను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్‌ (Twitter) శనివారం ఉదయం వెల్లడించింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అమెరికా క్యాపిటల్‌ భవనంలో జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం మొదట్లో ట్రంప్ (Donald Trump) ఖాతాలపై కొన్ని గంటలపాటు నిషేధాన్ని విధించిన ఫేస్‌బుక్‌, ట్విట్టర్, ఆ తర్వాత అధికార మార్పిడి పూర్తయ్యే వరకు ఆ నిషేధాన్ని పొడిగించాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్‌ మరో సంచనల నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. Also Read: Donald Trump: దిగొచ్చిన ట్రంప్.. అధికార బ‌దిలీకి అంగీకారం


గత నవంబర్‌లో జరిగిన అమెరికా (US Presidential election 2020) అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు ఇటీవల యూఎస్‌ కాంగ్రెస్‌ (US Congress) సమావేశమైంది. రెండు నెలలుగా ఓటమిని ఒప్పుకొని ట్రంప్.. దీనిని అడ్డుకునేందుకు తన మద్దతుదారులను ఉసిగొల్పడంతో యూఎస్‌ క్యాపిటల్‌ భవనంలో ఘర్షణ చెలరేగింది. ఈ హింస (US Capitol violence)లో నలుగురు పౌరులతో పాటు ఓ పోలీస్‌ అధికారి మృతి చెందారు. అనంతరం ట్రంప్ జనవరి 20న అధికార మార్పిడికి ఒప్పుకున్నారు. Also Read: US Congress: జో బైడెనే అధ్యక్షుడు.. హింస అనంతరం యూస్ కాంగ్రెస్ ప్రకటన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook