Helicopters Collided Mid-Air In Australia: ఆకాశంలో రెండు హెలీక్యాప్టర్స్ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి విషమంగానే ఉంది. ఆస్ట్రేలియాలో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయిన గోల్డ్ కోస్ట్ బీచ్ ఒడ్డున సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సీ వరల్డ్ మెరైన్ థీమ్ పార్కుకి సమీపంలోనే జరిగిన ఈ ప్రమాదం తొలుత అందరినీ కలవరపాటుకు గురిచేసింది. నూతన సంవత్సర వేడుకలతో బిజీగా ఉన్న జనం ఈ ఊహించని పరిణామం చూసి షాక్ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు హాలీక్యాప్టర్స్‌లో ఒక హెలీక్యాప్టర్ పాక్షికంగా దెబ్బ తినగా.. మరో హెలీక్యాప్టర్ పూర్తిగా శిథిలమైనట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో చాపర్స్ కూలిన తరువాత కనిపించిన దృశ్యాల్లో చాపర్స్ విడిభాగాలు అక్కడ పడిపోవడం చూడొచ్చు. ఘటనపై సమాచారం అందుకున్న ఆస్ట్రేలియా పోలీసులు హుటాహటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 

ఈ ఘటనపై ఆ స్థానిక క్వీన్స్‌లాండ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వెనుకున్న కారణాలు ఏంటో వెలికి తీయాల్సిందిగా స్పష్టంచేస్తూ ఆస్ట్రేలియా ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో సైతం విచారణకు ఆదేశించింది. ఆస్ట్రేలియా ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో విభాగం నుంచి అధికారులు అక్కడికి చేరుకుని ఘటనపై దర్యాప్తు జరపనున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.