UAE Travel Ban: భారత్‌కు ప్రయాణాలు నిషేధిస్తూ పౌరులపై యూఏఈ కఠిన Covid-19 ఆంక్షలు
UAE Travel Ban To India: కచ్చితమైన కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని యూఏఈ ప్రజలకు సూచించారు. 14 దేశాలకు విమానాల రాకపోకలపై నిషేధం అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.
UAE Travel Ban To India: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరోసారి కోవిడ్19 ఆంక్షలు విధించింది. యూఏఈ నుంచి భారత్ సహా మరికొన్ని దేశాలకు తమ ప్రజల ప్రయాణాలను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశాలలో ఒకటైన యూఏఈ ప్రభుత్వం కరోనా థర్డ్ వేవ్ రాకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటోంది.
యూఏఈ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియత్నాం, నమీబియా, జాంబియా, కాంగో, ఉగండా, సియోరా లియోన్, లైబీరియా, దక్షిణాఫ్రికా మరియు నైజీరియా దేశాలకు ప్రయాణాలు నిషేధిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ 14 దేశాలకు ప్రయాణాలపై జులై చివరి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని విదేశాంగశాఖ, నేషనల్ ఎమర్జెన్సీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు స్పష్టం చేశారు. ఇతర దేశాలకు వెళ్తున్న ప్రయాణికులకు సైతం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కచ్చితమైన కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జులై 21 వరకు 14 దేశాలకు విమానాల రాకపోకలపై నిషేధం అమలులో ఉంటుందని యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అధికారులు జూన్ నెలలో ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే.
Also Read: EPFO Benifits: ఈపీఎఫ్ ఖాతాలున్నాయా, అయితే ఈ 5 EPF బెనిఫిట్స్ తెలుసుకోండి
ఛార్టర్ ఫ్లైట్స్, కార్గో విమానాలు, వ్యాపార సంబంధిత విమాన సర్వీసులకు మినహాయింపు ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. యూఏఈ ప్రజలు కచ్చితంగా ప్రభుత్వం విధించే కోవిడ్19 నిబంధనలు కచ్చితంగా పాటించాలని అప్రమత్తం చేసింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు యూఏఈ ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు భారత్ నుంచి యూఏఈకి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రయాణ ఆంక్షలు అమలులో ఉన్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇదివరకే పలుమార్లు పలు దేశాలు భారత్ నుంచి ప్రయాణ ఆంక్షలు విధించడం తెలిసిందే.
Also Read: Samsung Galaxy F22 Price: జులై 6న విడుదలకు సిద్ధంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22, ఫీచర్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook