యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  ( UAE ) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఇస్లామిక్ చట్టాల్లో మార్పులు చేసింది. మద్యపానం, సహజీవనాన్ని ఇకపై చట్టబద్దం చేసింది. యూఏఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇస్లామిక్ లా చాలా కఠినంగా ఉంటుంది. మద్యపానం, అక్రమ సంబంధాలు, పెళ్లి చేసుకోకుండా నివసించడం , దొంగతనం వంటివాటికి కఠినమైన శిక్షలుంటాయి. దుబాయ్ ( Dubai ), కువైట్ ( Kuwait ) లో తప్పించి మిగిలిన దేశాల్లో మద్యపానం పూర్తిగా నిషేధం. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా దుబాయ్, కువైట్ మార్గంలో పయనిస్తున్నట్టు కన్పిస్తోంది. పర్యాటకుల్ని ఆకర్షించేందుకు సంచలనమైన నిర్ణయం తీసుకుంది. 


దేశంలోని ఇస్లామిక్ చట్టాలకు మార్పులు చేస్తూ కీలక ప్రకటన చేసింది. పర్యాటకుల్ని ఆకర్షించేందుకు చట్టాల్ని సరళతరం చేసింది. మద్యపానం ( Liquor ) సేవించడం, సహజీవనం చట్టవిరుద్ధం కాదని ప్రకటించింది. అవివాహిత జంటల్ని ఒకేచోట నివసించేందుకు అనుమతిస్తూ..మద్యపానంపై నియంత్రణల్ని సరళతరం చేసింది. ఇస్లామిక్ వ్యక్తిగత చట్టాల్లో కీలక మార్పులు చేసింది. 


పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం, చట్టాల అమలును మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఈ సంస్కరణలను చేపట్టామని యూఏఈ ప్రభుత్వం తెలిపింది.. గతంలో మద్యం సేవించినా, మద్యాన్ని కలిగిఉన్నా యూఏఈలో నేరంగా పరిగణించేవారు. ఇక తాజా నిర్ణయంతో 21 సంవత్సరాలు పైబడిన వారు స్వేచ్ఛగా మద్యాన్ని సేవించవచ్చు. ఇక అవివాహిత జంట కలిసి ఉండటం యూఏఈలో ఇప్పటివరకూ నేరం కాగా, ఆ చట్టాన్ని ప్రస్తుతం తొలగించారు.


అయితే యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంతమంది స్వాగతిస్తుంటే.మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. చుట్టుపక్కల సౌదీ దేశాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పలు సవాళ్లు ఎదురైనా కీలక మార్పులకు నాంది పలికారని అల్ జజీరా ఛానెల్ వ్యాఖ్యానించింది.  Also read: US Elections 2020: ఓటమిని అంగీకరించు, వైట్ హౌజ్ ఖాళీ చేసేద్దాం- ట్రంప్ భార్య