Uber | ప్రపంచంలో కరోనావైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న వారి కోసం వ్యాక్సిన్‌ క్యూలో రానున్నాయి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అమెరికా లాంటి దేశాలే కాకుండా వివిధ ప్రైవేటు సంస్థలు కూడా వ్యాక్సిన్ కోసం క్యూకడుతున్నాయి. ఆ సంస్థలు తమ ఉద్యోగులకు ముందుగా వ్యాక్సిన్ అందేలా ప్రయత్నిస్తున్నాయి. రిస్కీ రంగాల్లో ఉన్న వారు ఆ ప్రయత్నం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ|  Driving at Night: డ్రైవింగ్ చేస్తోంటో నిద్ర వస్తోందా? ఇలా చేయండి


అందులో ఉబర్ (Uber) సంస్థ కూడా ఉంది. ఈ మేరకు ఉబర్ సంస్థ అమెరికా ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, డ్రైవర్లకు ముందుగా టీకా అందించాలి అని కోరింది. సామాన్య ప్రజలతో కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి తమ డ్రైవర్లకు కోవిడ్-19 సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంది అని.. అందుకే వారికి ముందుగా టీకా అందించాలి అని కోరింది ఉబర్.



ALSO READ| Japan: జపాన్ లో పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం కట్నం ఇస్తుందట


కోవిడ్-19 (Covid-19) మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు యోద్ధుల్లా తమ ఉద్యోగులు రవాణ రంగంలో ఉన్నారు అని ఈ మేరకు తమ డ్రైవర్లకు ముందుగా వ్యాక్సింన్ అందించాలి అని అమెరికాలోని 50 రాష్ట్రాల గవర్నర్లకు లేఖ రాసింది ఉబర్. దాంతో పాటు అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ని కూడా తమ మనవిని వినమని కోరింది ఉబర్. అయితే దీనిపై ఇప్పటివరకు అక్కడి ప్రభుత్వం స్పందించలేదు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook