Ukraine Cholera: రష్యా మిలటరీ ఆపరేషన్‌తో ఉక్రెయిన్‌లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూలిన భవనాలు, పేరుకుపోయిన చెత్త, కుళ్లిన శవాలు, కలుషిత నీరు అక్కడివారికి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మరియుపోల్, ఖేర్సన్ వంటి నగరాల్లో ఇవే దర్శనమిస్తున్నాయి. దీంతో అక్కడ కలరా వ్యాధి ప్రబలుతోంది. ఇప్పటికే పలు కేసులను గుర్తించారు. ప్రస్తుతం ప్రధాన నగరాలన్నీ రష్యా చేతుల్లోకి వెళ్లాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుళ్లుతున్న శవాలు, శిథిలాల వల్ల కలరా వ్యాప్తికి కారణమవుతున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కలరా బారిన పడి మృతి చెందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై ఐక్యరాజ్య సమితి సైతం హెచ్చరికలు జారీ చేసింది. గత నెలలోనే కేసులు వెలుగు చూశాయని మరియుపోల్ గవర్నర్ వెల్లడించారు.


పరిస్థితి ఇలాగే ఉంటే వైరల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. ఐతే రష్యా నియమించిన గవర్నర్ మాత్రం దీనికి ఖండిస్తున్నారు. ఎప్పటికప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు ఒక్క కలరా కేసులు బయటపడలేదని వెల్లడించారు. మరియుపోల్‌లోని పరిస్థితిపై తమకు సమాచారం లేదని ఉక్రెయిన్ ఆరోగ్యశాఖ ప్రకటించారు. ఏప్రిల్ నాటికి మరియపోల్‌లో 10 వేల మంది మరణించినట్లు అంచనా వేస్తున్నారు.


ఇప్పుడా సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరియుపోల్‌లో తాగు నీరు కలుషితం వల్ల అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి, రెడ్‌ క్రాస్‌ ముందే హెచ్చరించాయి. మరోవైపు మందుల కొరత వెంటాడుతోంది. దీంతో అక్కడ పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. మరియుపోల్‌లో వైద్యులు సైతం అందుబాటులో లేరని స్థానికులు చెబుతున్నారు.


కలరా చాలా భయంకరమైన వ్యాధి. సకాలంలో చికిత్స అందకపోతే జబ్బు తీవ్రమై..మనిషి చనిపోయే అవకాశం ఉంది. కలరా విబ్రియో కలరే అనే బాక్టీరియా నుంచి ప్రబలుతుంది. ఈక్రమంలోనే కలుషిత ఆహారం, నీరు తాగడం వల్ల వ్యాధి మరింత విజృంభిస్తుంది. గతంలో కలరా వల్ల ప్రపంచ దేశాలు వణికిపోయాయి. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. మొత్తంగా ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ ఆపరేషన్ ఏకధాటిగా కొనసాగుతోంది.


Also read: Pawan Kalyan Tweet: సంపూర్ణ మద్య నిషేధం అంటే ఆదాయం సంపాదించడమేనా..జగన్‌పై పవన్‌ ఫైర్..!


Also read:UP Violence: అల్లర్లకు పాల్పడితే ఇల్లు నేలమట్టం.. బుల్‌డోజర్లను దించేసిన యోగీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి