Pawan Kalyan Tweet: తాజాగా మరోసారి తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. మద్యం విధానానికి సంబంధించి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. కాదు కాదు..సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం అనేలా చేశారని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఏపీలో సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివేనని..ట్విట్టర్లో తెలిపారు.
దీనికి చిన్న గమనిక అంటూ ట్వీట్లో స్పష్టంగా పేర్కొన్నారు. మద్యం ద్వారా వచ్చే అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికేనని మండిపడ్డారు. ఈసందర్భంగా ట్వీట్లో కొన్ని సామెతలు పోస్ట్ చేశారు. అబద్ధమాడు పెదవులు యోహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని ఈసందర్భంగా గుర్తు చేశారు.
సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం
చిన్న గమనిక: సారా బట్టీలు,బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే..సామెతలు 12:22
అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు https://t.co/cthy29YWc5— Pawan Kalyan (@PawanKalyan) June 12, 2022
Also read:Virata Parvam Real Story: విరాటపర్వం అసలు కథ ఇదేనా... సాయి పల్లవి పాత్ర నిజ జీవితంలో ఆమెదేనా..?
Also read: Omicron Virus: కోరలు చాస్తున్న ఒమిక్రాన్..షాకింగ్ విషయాలు వెల్లడించిన రష్యన్ శాస్త్రవేత్తలు..!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి