Ukraine crisis: తన సినిమాల్లో శత్రువులను చంపి దేశాన్ని కాపాడినట్లే.. నిజ జీవితంలో కూడా తన దేశాన్ని కాపాడుకోవడానికి కథన రంగంలోకి దూకాడు ఓ నటుడు. తుపాకీ చేతబట్టి శత్రుమూకలపై గుళ్ల వర్షం కురిపించాడు. కానీ దురదృష్టవశాత్తూ శత్రుసైనికుల దాడిలో యుద్ధభూమిలో ప్రాణాలు విడిచాడు ఆ నటుడు. అతడే ఉక్రెయిన్ యాక్టర్ పాషా లీ (ukrainian actor pasha lee). ఆయన మరణ వార్తను ఒడెసా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ధ్రువీకరిస్తూ.. అతడి మృతికి సంతాపం ప్రకటించింది. పాషా లీ.. క్రిమియాలో జన్మించాడు. అంతేకాకుండా పలు ఉక్రెయిన్ సినిమాల్లో నటించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా తన దేశాన్ని రక్షించుకోవడానికి సాయుధ దళాలలో చేరిన ఉక్రేనియన్ నటుడు పాషా లీ, 33 సంవత్సరాల వయస్సులో ఇర్పిన్‌ ప్రాంతంపై రష్యా జరిపిన షెల్లింగ్‌లో (russia shelling irpin) మరణించారు. మరణానికి ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో తన చివరి ఫోటోను షేర్ చేశాడు.‘‘''ఉక్రెయిన్‌ కోసం మేం ఏమైనా చేస్తాం. అందుకే మేం నవ్వుతూ ఉన్నాం'' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.  దేశాన్ని రక్షించుకునేందుకు పౌరులందరూ సైన్యంలో చేరాలని, అవసరమైతే ఆయుధాలు కూడా ఇస్తామని అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపునివ్వడంతో.. పాషా దేశ టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్స్‌లో చేరాడు. 



Also Read: Ukrain Military Vehicles: ఉక్రెయిన్ నగరం శిధిలమయం, మిస్సైల్, ట్యాంకర్ దాడుల విధ్వంసకర పరిస్థితి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook