Indian Student killed In Ukraine: రష్యా మిస్సైల్ దాడిలో ఉక్రెయిన్‌లోని భారత విద్యార్థి మృతి
Indian Student killed In Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధంలో ఓ భారతీయడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఉదయం జరిగిన మిస్సైల్ దాడిలో ఉక్రెయిన్లో ఉంటున్న ఓ మెడికల్ విద్యార్థి మృతి చెందాడు.
Indian Student killed In Ukraine: ఉక్రెయిన్లో విషాదం చోటు చేసుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించింది.
ఏ ఒక్క భారతీయుడుకి కూడా రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రమాదం బారిన పడకుండా.. తరలింపు చేపట్టింది ప్రభుత్వం. అయినప్పటికీ ఓ విద్యార్థి ఇలా ప్రాణాలు కోల్పోవడం విచారకరమని విదేశంగ శాఖ పేర్కొంది.
మృతుడి వివరాలు..
ఈ ఉదయం ఖర్కేవ్పై జరిగిన రష్యా మిస్సైల్ దాడిలో.. కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని విచారణంతో ధృవీకరిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి ట్విట్ట్ ద్వారా వెల్లడించారు.
ఈ ఘటనతో రష్యా, ఉక్రెయిన్ రాయబారులను పిలిచి.. దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్న భారత పౌరులను సురక్షితంగా తరలించాదుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు.
వెంటనే కీవ్‌ను వీడండి..
రష్యా దాడుల్లో ఓ భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం.. భారత పౌర్లకు అడ్వైజరీ జారీ చేసింది. దాడులు తీవ్ర రూపంలో దాల్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భారత పౌరులంతా కీవ్ నగరాన్ని వీడాలని సూచించింది. వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పేర్కొంది.
ఇప్పటికే ఉక్రెయిన్లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి సురక్షితంగా రప్పించేందుకు కేంద్రం ఆపరేషన్ గంగాను చేపట్టింది. ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థులు, ఇతర పౌరులను ఉక్రెయిన్ నుంచి వెనక్కి రప్పించింది. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.
తాజాగాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాయు సేన ఆపరేషన్ గంగాలో పాల్గొనాలని విజ్ఞప్తి కూడా చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఆపరేషన్ గంగాను మరింత వేగంగా అమలు చేసే అవకాశముంది.
Also read: Viral Video: ఒంటి చేత్తో యుద్ధ ట్యాంక్‌ని ఆపేసిన ఉక్రెయిన్ వాసి, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook