North Korea: ఉత్తర కొరియా వరుస క్షిపణి ప్రయోగాలు ప్రపంచ దేశాల్లో ఆందోళనను పెంచుతున్నాయి. తాజాగా రైలులో నిర్మించిన క్షిపణి వ్యవస్థతో ఉత్తర కొరియా(North Korea) బుధవారం తొలిసారిగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించింది. దీనిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UN Security Council) ఆందోళన వ్యక్తం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూఎన్ ఓ(UNO)లో ఫ్రెంచ్ అంబాసిడర్ నికోలస్ రివర్స్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చేర్చబడిన దేశాలు శాంతి మరియు భద్రతకు ఇటువంటి ముసాయిదా పరీక్షలు ప్రధాన ముప్పు అని, కౌన్సిల్ తీర్మానాలను కూడా ఉల్లంఘించాయని చెప్పారు. ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) ప్రకారం.. బుధవారం ప్రయోగించిన క్షిపణి రైల్వే ఆధారిత క్షిపణి వ్యవస్థను పరీక్షించడానికి ఉద్దేశించింది. ఉత్తర కొరియా(NorthKorea)కు ఎలాంటి ముప్పు వచ్చినా ప్రతిస్పందించేలా ఇది రూపొందించింది.


Also Read: North Korea: సదూర లక్ష్యాల్ని ఛేదించే ఉత్తర కొరియా క్రూయిజ్ క్షిపణి పరీక్షలు విజయవంతం


ఏ మూలనుంచైనా క్షిపణులు ప్రయోగించగలదు..
రైలు ద్వారా క్షిపణి పరీక్ష(Missile test) సాంకేతికతను సిద్ధం చేయడం ద్వారా ఉత్తర కొరియా ఇప్పుడు దేశంలోని ఏ మూలలోనైనా క్షిపణులను ప్రయోగించగలదు. ఎందుకంటే మొత్తం ఉత్తర కొరియా అంతా రైల్వే నెట్‌వర్క్ ఉంది. అయితే, సంక్షోభ సమయాల్లో, ఉత్తర కొరియా రైల్వే నెట్‌వర్క్(Railway network) కూడా దాడి చేసేవారికి సులభమైన లక్ష్యంగా ఉంటుంది. తమ క్షిపణి శక్తిని పెంచాలనుకునే దేశాలకు రైలు ఆధారిత  క్షిపణి వ్యవస్థలు చౌకైన, విశ్వసనీయమైన ఎంపిక అని యుఎస్ క్షిపణి నిపుణుడు ఆడమ్ మౌంట్ చెప్పారు. రష్యా కూడా ఈ వ్యవస్థను సిద్ధం చేసింది మరియు అమెరికా కూడా దీనిని పరిశీలిస్తోంది.


పోటా పోటీ..
మరోవైపు దక్షిణ కొరియా(South Korea) కూడా బుధవారం, ఒక జలాంతర్గామి నుంచి ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణిని (SLBM) పరీక్షించింది. అణ్వాయుధాలు లేకుండా ఈ వ్యవస్థను అభివృద్ధి చేసిన మొదటి దేశంగా అవతరించింది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఆయుధ పోటీ వేగంగా పెరుగుతోంది. రెండు దేశాలు కొత్త ఆయుధాలతో పాటు అధిక సామర్థ్యం గల క్షిపణులను పరీక్షిస్తున్నాయి.


3 రోజుల కిందటే..
ఉత్తర కొరియా ఆదివారం కొత్త లాంగ్-రేంజ్ క్షిపణిని కూడా పరీక్షించింది. ఈ క్షిపణి 1500 కిలోమీటర్ల దూరాన్ని కూడా చేరగలదు. ఈ పరిధిలో, ఉత్తర కొరియాకు జపాన్‌లో ఎక్కువ భాగం లక్ష్యంగా ఉంటుంది. కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఈ క్రూయిజ్ క్షిపణి(Cruise missile)ని రెండు సంవత్సరాల పాటు సిద్ధం చేస్తున్నట్లు నివేదించింది. ఈ క్షిపణిలో న్యూక్లియర్ కెపాబిలిటీ సిస్టమ్ ఉండే అవకాశం ఉందని అమెరికా నిపుణులు భావిస్తున్నారు.


జపాన్ ఆందోళన...
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం గురించి తాము ఆందోళన చెందుతున్నామని జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ కట్సునోబు కటో చెప్పారు. మేము దీనిని అమెరికా(America), దక్షిణ కొరియాతో కలిసి పర్యవేక్షిస్తామని తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook