Vaccine Efficacy: యూఎస్ వ్యాక్సిన్‌ల విషయంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. వ్యాక్సిన్ పనితీరుపై సీడీసీ అధ్యయం చేసి..నివేదిక విడుదల చేసింది.  వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందనే విషయంపై ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూఎస్‌కు చెందిన ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌( pfizer and Moderna vaccines)లు అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని సీడీసీ అంటే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చేసిన అధ్యయనంలో తేలింది. ఈ వ్యాక్సిన్  మొదటి రెండు షాట్స్ తీసుకున్న తరువాత వ్యాధి సంక్రమణ ప్రమాదం 80 శాతానికి పడిపోయిందని సీడీసీ (CDC) తెలిపింది. అమెరికాలోని మెడికల్ సిబ్బందికి ఇచ్చిన తొలి డోస్‌లోనే ఈ విషయం వెల్లడైంది. రెండు వారాల వ్యవధి అనంతరం ఇచ్చిన రెండవ డోస్‌తో వ్యాధి సంక్రమణ ప్రమాదం 90 శాతానికి పడిపోయిందని పరిశోధకులు గుర్తించారు. 


కరోనా వైరస్ సోకి..లక్షణాలు లేనివారి నుంచి వ్యాధి సంక్రమించకుండా వ్యాక్సిన్ రక్షిస్తోందనే ఆసక్తికర విషయం వెల్లడైంది. వ్యాక్సిన్ తీసుకున్న 4 వేల మందిపై జరిపిన అధ్యయనంలో తేలిన కీలక విషయాల్ని నివేదిక రూపంలో సీడీసీ విడుదల చేసింది. 2020 డిసెంబర్ 20 నుంచి మార్చ్ 13 వరకూ అంటే 13 వారాల వ్యవధిలో ఆరు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ తీసుకున్న 3 వేల 950 మందిలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయని తెలిసింది. ఎంఆర్ఎన్ఏ కోవిడ్ 19 వ్యాక్సిన్లు దేశ ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్ వారియర్లకు వ్యాధి సంక్రమణకు వ్యతిరేకంగా మెరుగైన రక్షణ అందించాయని తెలిసింది. ఎంఆర్ఎన్ఏ సాంకేతికత ఒక సహజ రసాయన మెసెంజర్ సింథటిక్ రూపం, కరోనా వైరస్ (Coronavirus)నుంచి రక్షించేందుకు, రోగ నిరోధక శక్తిని అందించేందుకు ఉపయోగపడుతోంది. 


Also read: PM Modi: బంగ్లాదేశ్‌లో జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook