యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ( United States of America) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫైరయ్యారు. అమెరికా ఎన్నికల సందర్భంగా ఒక ర్యాలీలో పాల్గొన్న ఒబామా ట్రంప్ ఒక క్రేజీ అంకుల్ ( Trump is a Crazy Uncle ) అని చమత్కరించాడు. ట్రంప్ తన పరిపాలనలో వివక్షతను పెంచి పోషించాడు అని విమర్శించాడు. పెన్సిల్వేనియా సభలో ఒబామా ఇలా కామెంట్ చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Watch: Video: బౌలర్ గా ధోనీ తిసిన ఒకే ఒక వికెట్ ఎవరిదో తెలుసా ? 


మరోవైపు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump) కూడా నార్త్ కరోలినాలో ఒక సభలో మాట్లాడుతూ ఒబామాను విమర్శించాడు. గత ఎన్నికల్లో తను గెలవడానికి కారణం ఒబామా ప్రభుత్వం విఫలం అవ్వడమే అని తెలిపాడు. ఒమామాకు ( Barack Obama ) నిజాయితీ లేదు అని, ఒకప్పుడు హిల్లరీ క్లింటన్ కోసం ప్రచారం చేశాడు అని.. ఇప్పుడు బైడెన్ కోసం ప్రచారం చేస్తున్నాడు అని విమర్శించాడు ట్రంప్. 



Also Read | Covid-19 Vaccine: కరోనా అంతం అసంభవం అంటున్న బ్రిటిష్ శాస్త్రవేత్త


అమెరికా ఎన్నికల్లో ( US Elections 2020 ) ఇప్పటి వరకు సుమారు 42 మిలయన్ల మంది వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్లు వేశారు. ఇలాంటి సందర్భంలో తను గెలవడానికి ట్రంప్ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. బైడెన్ గెలిస్తే తను అమెరికా నుంచి వెళ్లిపోతానేమో అని ఇటీవలే కామెంట్ కూడా చేశాడు ట్రంప్. దీనిపై నెటిజెన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR