Covid-19: అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కోవిడ్ పాజిటివ్
Covid-19: అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఈమె గత ఏడాది ఆగస్టులో కరోనా బారినపడ్డారు. అయితే అధ్యక్షుడు బైడెన్‌కు మాత్రం నెగిటివ్ వచ్చింది.
President Joe Biden: అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కరోనా(Covid-19) బారిన పడ్డారు. కోవిడ్ పరీక్షలో ఆమె పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. అధ్యక్షుడు బైడెన్‌కు(President Joe Biden) మాత్రం టెస్టులో నెగిటివ్ వచ్చినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. 72 ఏళ్ల ఫస్ట్ లేడీ జిల్ బైడెన్(Us First Lady Jill Biden) కు చివరిసారిగా గత ఏడాది ఆగస్టులో కోవిడ్ సోకగా... ప్రెసిడెంట్ జో బైడెన్‌కు 2022 జూలైలో కరోనా వచ్చింది. అయితే మరో రెండు రోజుల్లో ఢిల్లీలో జరగనున్న జీ20 సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ హాజరుకావాల్సి ఉంది. దీంతో వీరిద్దరూ జీ20 సదస్సుకు హాజరవుతారా లేదోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం జిల్ బైడెన్‌కు కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని శ్వేతసౌధం వెల్లడించింది. ప్రస్తుతం ఆమె దిలావర్‌లోని రిహోబోత్ బీచ్‌లో ఉన్న ఇంట్లో ఉంటున్నారు.
80 ఏళ్ల అధ్యక్షుడు జో బైడెన్‌కు సోమవారం కోవిడ్ టెస్టు చేయగా.. ఆయనకు నెగిటివ్ గా రిపోర్టు వచ్టినట్లు వైట్‌హౌజ్ తెలిపింది. వాస్తవానికి అధ్యక్షుడు జో బైడెన్, జిల్ బైడెన్ సెప్టెంబరు 07న జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు ఇండియా రావాల్సి ఉంది. ప్రెసిడెంట్ బైడెన్ సెప్టెంబరు 08న ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వైట్ హౌస్ పేర్కొంది. అంతేకాకుండా సెప్టెంబరు 9-10 తేదీల్లో జీ20 సదస్సులో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో జీ20 భాగస్వాములతో క్లీన్ ఎనర్జీ, వాతావరణ మార్పులు వంటి అనేక సమస్యలపై చర్చించనున్నారు. కొన్ని వారాల నుంచి అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు.
Also Read: South Africa Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 63 మంది సజీవ దహనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook