వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనపై స్పందించారు. ఈ నెలాఖర్లో భారత్ పర్యటనకు రానున్న నేపథ్యంలో తాజాగా ఓ ట్వీట్ చేసిన ట్రంప్.. భారత్ పర్యటనపై ఎంతో ఆసక్తితో ఉన్నట్టు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత్‌లో పర్యటించనుండటాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ స్పష్టంచేశారు. అలాగే ఫేస్‌బుక్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నెంబర్ 1 స్థానంలో ఉంటే... భారత ప్రధాని నరేంద్ర మోదీ నెంబర్ 2 స్థానంలో ఉన్నారని ఇటీవల ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న ట్రంప్.. మరో రెండు వారాల్లో తాను భారత్‌ పర్యటనకు వెళ్లనుండటం ఎగ్జైటింగ్‌గా ఉందని అన్నారు. అంతేకాకుండా అన్నీ కుదిరితే పలు వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 24-25వ తేదీల్లో డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై గత బుధవారం ప్రధాని మోదీ స్పందిస్తూ.. ''అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఎంతో ప్రత్యేకమైనది'' అని అన్నారు. ''ట్రంప్ భారత పర్యటనతో  భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడతాయి'' అని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు.



ఇటీవల అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ సైతం భారత్ పర్యటనపై స్పందిస్తూ.. తమని భారత్‌కి ఆహ్వానించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అహ్మెదాబాద్, న్యూఢిల్లీలో పర్యటన కోసం ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్టు ఆమె ట్వీట్ చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..