H1B visa issue: అగ్రరాజ్యంలో తీసుకునే ప్రతి నిర్ణయం ప్రత్యక్షంగానో పరోక్షంగానే భారతదేశాన్ని ప్రభావితం చేస్తుంటుంది. అందుకే ఆ దేశపు ఎన్నికలంటే ఇండియాలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. బిడెన్ తీసుకున్న మరో నిర్ణయం ఫలితంగా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)నిర్ణయాల కారణంగా భారతీయ ఐటీ నిపుణులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ విజయం సాధించడంతో మంచి జరుగుతుందని భావించారు. ఇండియన్ ఐటీ ఎక్స్‌పర్ట్స్ ఊహించినట్టే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జో బిడెన్ తీసుకున్న నిర్ణయంతో భారతీయ ఐటీ నిపుణులకు మేలు జరగబోతోంది.


హెచ్ 1 బి వీసా (H1B Visa) జారీకు సంబంధించి కనీస వేతనాల్ని భారీగా పెంచుతూ డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా అమెరికా కలలుగన్న భారతీయ ఐటీ నిపుణులకు నిరాశే ఎదురైంది. ఇప్పుడీ ఆదేశాల అమలును మరింత ఆలస్యం చేస్తూ జో బిడెన్( Joe Biden) ఉత్తర్వులు జారీ చేయడంతో  ఐటీ నిపుణులు ఊపిరిపీల్చుకున్నారు. కార్మికశాఖ ప్రచురించిన ఫెడరల్ నోటిఫికేషన్‌లో మే 14వ తేదీ వరకూ అమలు నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా అమెరికాలోని కొంతమంది విదేశీయుల తాత్కాలిక, శాశ్వత ఉద్యోగుల వేతన ప్రయోజనాల్ని కాపాడనుందని తెలిపింది. తద్వారా భారతీయ ఐటీ నిపుణులకు లబ్ది చేకూరనుంది. మే 14 తరువాత  అమలు చేయాలా వద్దా అనేది ప్రజాభిప్రాయాన్ని సేకరించి నిర్ణయించనున్నారు. 


తాను ప్రవేశపెట్టిన ఆదేశాల వల్ల అమెరికా సంస్థలపై విదేశీ ఉద్యోగుల వేతన భారం తగ్గడంతో పాటు విదేశీ ఉద్యోగుల స్థానంలో అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తాయని ట్రంప్ అప్పట్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగా కనీస వేతన నిబంధన తీసుకొచ్చారు. ఈ ఉత్తర్వులపై అప్పట్లో ఇరువైపుల్నించీ భారీగా నిరసన వ్యక్తమైంది. ఇప్పుడు జో బిడెన్ తీసుకున్న నిర్ణయంతో భారతయ ఐటీ నిపుణులు ( Indian it experts) హర్షం వ్యక్తం చేస్తుంటే..ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ సంస్థ మాత్రం వ్యతిరేకిస్తోంది. అమెరికా ఉద్యోగులు, సంస్థ భద్రత నిమిత్తం  ట్రంప్ ఆదేశాల్ని నిలుపుదల చేయడం కరోనా సంక్షోభంలో చిక్కుకున్నవారిని మరింతగా క్షీణింపజేయనుందని చెబుతోంది. 


Also read: AstraZeneca vaccine: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook