Joe Biden: అమెరికా అధ్యక్షుడి వింత చేష్టలు.. జోబైడెన్ కు ఏమైంది? వైరల్ వీడియో...
Joe Biden: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీరు వివాదాస్పదమవుతోంది. ఆయన చేష్టలతో మతి పోయిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న కార్యక్రమాల్లో ఆయన వింతవింతగా వ్యవహరిస్తున్నారు. సభా నిర్వాహకులను గందరగోళంలో పడేస్తున్నారు.
Joe Biden: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీరు వివాదాస్పదమవుతోంది. ఆయన చేష్టలతో మతి పోయిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న కార్యక్రమాల్లో ఆయన వింతవింతగా వ్యవహరిస్తున్నారు. సభా నిర్వాహకులను గందరగోళంలో పడేస్తున్నారు. మీడియా కూడా ఆయనతో కన్పూజ్ అవుతోంది. జోబెైడన్ వయసు 80 సంవత్సరాలు. ఆయనకు అల్జీమర్స్ వ్యాధి ఉంది. ఇప్పుడది ఆయనలో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో కీలకమైన సభల్లోనూ జోబైడెన్ తీరు నవ్వుల పాలవుతోంది. చెప్పాల్సినది కాకుండా మరో విషయం మాట్లాడుతున్నారు. ప్రసంగంలో గెస్టుల పేర్లు మార్చేస్తున్నారు. జోబైడెన్ వింత చేష్టలు వీడియోలో రికార్డు అవుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా అవి వైరల్ అవుతున్నాయి.
ఎయిడ్స్ , మలేరియా, టీబీ వ్యాధుల నియంత్రణ కోసం నిధి విరాళాల సేకరణ కోసం న్యూయార్క్ లో నిర్వహించిన గ్లోబల్ ఫండ్స్ సమావేశానికి అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ హాజరయ్యారు. జోబైడెన్ పిలుపుతో ఆ సంస్థకు 14.25 బిలియన్ల నిధి సమకూరింది.ప్రసంగం పూర్తయ్యాకా వేదిక నుంచి ఎటు వైపు నుంచి దిగాలో ఆయన మర్చిపోయారు. ఏం చేయాలో తెలియక తాను ప్రసంగించిన చోటే నిలబడిపోయారు. పోడియం దగ్గర అటు ఇటూ నడుస్తూ ఆగిపోయారు. ఆయన భద్రతా సిబ్బంది కూడా స్పందించలేదు. కాసేపటికే స్టేజి కింద ఉన్నవాళ్లు సూచనతో వేదిక దిగి వెళ్లిపోయారు జో బైడెన్. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అగ్రరాజ్యం ప్రెసిడెంట్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఆయన వయసు, హెల్త్ కండీషన్ కు కూడా పట్టించుకోకుండా కామెంట్లు చేస్తున్నారు.
గతంలోనూ పలు సమావేశాల్లో తనతో పాటు వేదిక పంచుకున్న దేశాధినేతల పేర్లు మార్చిపోయారు జోబైడెన్. ఒక దేశం పేరు బదులు మరొక దేశం పేరు ప్రస్తావించారు. జోబైడెన్ మతిమరుపుపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోరుగా సెట్టైర్లు వేస్తున్నారు.
Read also: TS Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..త్వరలో మరో నోటిఫికేషన్..!
Read also: Krishnam Raju Pet: కృష్ణంరాజు మృతితో ఆయన పెంపుడు కుక్క చేసిన పని తెలిస్తే షాక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి