US Elections 2024:  డొనాల్డ్ ట్రంప్ ముచ్చటగా రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు ఈ సంవత్సరం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు ప్రకటించే లోగానే ఆయన మ్యాజిక్ ఫిగర్ అందుకున్నారు మొత్తం 540 ఎలక్ట్రోరల్ సీట్లలో మొత్తం 277 సీట్లలో రిపబ్లికన్లు పై చేయి సాధించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే డెమొక్రటిక్ తరఫున బరిలో నిలబడ్డ కమల హరీస్ 227 సీట్లలో ఆదిపత్యం కనబరిచారు. దీంతో ట్రంప్ అధ్యక్ష ఎన్నిక అనేది ఖరారు అయింది. ఇదిలా ఉంటే డోనాల్డ్ ట్రంప్ విచిత్రంగా గెలిచిన రెండు మార్లు కూడా మహిళా అభ్యర్థుల పైనే గెలవడం గమనార్హం గతంలో 2016 వ సంవత్సరంలో ఆయన హిల్లరీ క్లింటన్ పైన విజయం సాధించారు ఆ తర్వాత 2020 సంవత్సరంలో జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. 


అనూహ్యంగా 2024వ సంవత్సరంలో మరోసారి మహిళా అభ్యర్థి కమల హారిస్ వై విజయం సాధించడం అనేది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన అని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి హోరాహోరీగా జరుగుతుంది అనుకున్న పోరులో స్వింగ్ స్టేట్లో సైతం రిపబ్లికన్ పార్టీ సత్తా చాటడంతో ట్రంప్ విజయం సునాయాసం అయింది. అయితే అటు డెమోక్రటిక్స్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కమల హరీస్ పట్టు నిలుపుకున్నారు.


Also Read: Pawan Kalyan Delhi Tour: పవన్ కళ్యాణ్ ఆకశ్మిక ఢిల్లీ పర్యటన వెనుక కారణమేంటి


 అతిపెద్ద రాష్ట్రం అయినా కాలిఫోర్నియాలో కమల పై చేయి సాధించారు. అలాగే డెమోక్రట్ కోటగా పిలవబడే అట్లాంటిక్ తీర రాష్ట్రాల్లో కమల తన సత్తా చాటారు. కానీ స్వింగ్ స్టేట్లో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇక్కడ ట్రంప్ సత్తా చాటడంతో డెమోక్రట్లకు పరాభవం తప్పలేదు. అయితే దాదాపు 120 సంవత్సరాల తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడు ఒకసారి గెలిచి మరొకసారి ఓడిపోయి మూడవసారి అధ్యక్షుడిగా పోటీ చేసి గెలవడం అరుదైన ఘనతగా అమెరికా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరుపొందిన అమెరికాలో మొదటి నుంచి కూడా రిపబ్లికన్లు, డెమోక్రాట్ల నుంచి మధ్యనే పోరాటం నడుస్తోంది.


248 సంవత్సరాల అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా మహిళా అధ్యక్షురాలు ఎన్నిక కాకపోవడం గమనార్హం. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన దేశంగా పిలవబడే సమాన హక్కులకు ఆలవాలంగా నిలిచే అమెరికాలో ఒక్క మహిళకు కూడా ఈ రోజు వరకు అధ్యక్ష పదవి దక్కలేదు. మనదేశంలో ప్రధానిగా ఇందిరాగాంధీ, అధ్యక్ష పదవిలో ప్రతిభా దేవి సింగ్ పాటిల్, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది మురుము వంటి మహిళలు దేశంలోనే అత్యున్నత స్థాయి పదవిలో నిలిచి తమ సత్తా చాటారు. ఇక ప్రపంచంలోనే అత్యంత చాందస దేశంగా పిలవబడే పాకిస్తాన్లో సైతం బెనజీర్ బుట్టో లాంటి మహిళ అక్కడ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. కానీ ఆధునిక అమెరికా చరిత్రలో మాత్రం ఇప్పటివరకు మహిళను అధ్యక్షురాలుగా ఎన్నుకోకపోవడం గమనార్హం.


Also Read:Inter Exams: ఇంటర్‌ పరీక్ష ఫీజు పెంపు.. ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు ఎంత చెల్లించాలంటే..?  


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.