America: ట్రంప్ పిటీషన్ కొట్టివేత, సుప్రీంకోర్టులో ట్రంప్‌కు చుక్కెదురు
America: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన డోనాల్డ్ ట్రంప్ ఇంకా ఓటమిని అంగీకరించడం లేదు. పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే..అక్కడ కూడా చుక్కెదురైంది. ఇకనైనా ఓటమి ఒప్పుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.
America: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన డోనాల్డ్ ట్రంప్ ఇంకా ఓటమిని అంగీకరించడం లేదు. పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే..అక్కడ కూడా చుక్కెదురైంది. ఇకనైనా ఓటమి ఒప్పుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ( America president Elections ) ముగిశాయి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ ( Joe Biden ) విజయం సాధించారు. అయినా సరే ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్‌తో సహా పలువురు రిపబ్లికన్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ( Supreme court )..నిబంధనలకు వ్యతిరేకంగా ఓటేసినట్టు ఆధారాల్లేవని స్పష్టం చేసింది. ట్రంప్ వేసిన పిటీషన్‌ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా ట్రంప్ ఓటమి అంగీకరించాలని..వేరే దారి లేదని నిపుణులు సూచిస్తున్నారు.
సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపధ్యంలో కొత్తగా ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ( Electoral college ) డిసెంబర్ 14న సమావేశమై..కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్‌ను అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. అమెరికాలోని నాలుగు ప్రముఖ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, మిషిగన్, విస్కాన్సిన్‌లో లక్షలాది ఓట్లను రద్దు చేయాలని..ఓటింగ్ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని రిపబ్లికన్లు ఈ పిటీషన్లు దాఖలు చేశారు. 126 మంది రిపబ్లికన్లు, 17 మంది అటార్నీ జనరల్స్ కలిసి దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Also read: Pfizer vaccine: వ్యాక్సిన్‌కు అమెరికా ఆమోదం..కానీ ట్రంప్ సంచలన ప్రకటన