Hippo predictions over us elections 2024: ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలు  ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకొవచ్చు. రిపబ్లిక్ వర్సెస్ డెమోక్రటికంట్ల మధ్య తగ్గఫార్ ప్రచారం జరిగిందని చెప్పుకొవచ్చు. అదే విధంగా డోనాల్డ్ ట్రంప్ కూడా తన పదునైన ప్రసంగాలతో అమెరికా ప్రజలను తనవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేశారు. మరోవైపు కమలా హరీస్ కూడా.. డోనాల్డ్ ట్రంప్ కు గట్టిగానే పోటీని ఇచ్చినట్లు తెలుస్తొంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ట్రంప్ పై ఇటీవల ఎన్నికల ప్రచారంలో కాల్పులు జరగటం కొంత వరకు ఆయనకు ప్రజల్లో సానుభూతి అంశాలుగా చెప్పుకుంటున్నారు.  మరోవైపు.. కమలా హరీస్ కు కూడా భారత్ మూలాలు ఉండటం వల్ల అమెరికాలో ఉన్న ఎక్కువ మంది భారతీయుల్ని తనవైపుకు తిప్పుకునేందుకు కమలా హరీస్ కు తనదైన శైలీలో ప్రచారం చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో థాయ్ లాండ్ జూలోని పిగ్మీ హిప్పో ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అమెరికాలో థాయ్ లాండ్ లోని బుజ్జి పిగ్మీ హిప్పో అమెరికా పీఠంను ఎవరు అధిష్టిస్తారో వారిని తెల్చేసింది. అయితే.. ఈ హిప్పోను చాలా మంది ఎంతో నమ్ముతారు. గతంలో పలు సందర్భాలలో హిప్పో చెప్పిన జోస్యం నిజమైన సందర్భాలు కూడా లేకపోలేదు.


ఈ క్రమంలో ఈరోజు అమెరికా ఎన్నికల నేపథ్యంలో.. డోనాల్డ్ ట్రంప్, కమలా హరీస్ లలో ఎవరు గెలుస్తారో.. అని రెండు పుచ్చకాయల కేకులను సపరేట్ గా దాని ముందు ఉంచారు. ఒక దానిమీద డోనాల్డ్ ట్రంప్ మరోదాని మీద కమలా హరీస్ పేరును రాసి హిప్పో ముందు ఉంచారు.


Read more: Canada News: కెనడాలో దారుణం.. ఆలయంలోని హిందువులపై దాడి.. జస్టీస్ ట్రూడో ఏమన్నారంటే..?


అప్పుడు హిప్పో వచ్చి.. డోనాల్డ్ ట్రంప్ పేరు ఉన్న పుచ్చకాయ కేకును తినేసింది.  దీంతో హిప్పో జోస్యం ప్రకారం అమెరికా పీఠం ఎక్కేది డోనాల్డ్ ట్రంప్ అంటూ కూడా అక్కడి వాళ్లు సంబరాలు చేసుకుంటున్నారంట. ప్రస్తుతం ఈ వీడియో  మాత్రం వైరల్ గా మారింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook