Hindu Temple Brampton mandir Attacked by khalistani extremists in Canada: కెనడాలో మళ్లీ ఖలీస్తానీ సానుభూతీపరులు రెచ్చిపొయినట్లు తెలుస్తొంది. హిందువులే టార్గెట్ గా చేసుకుని కొన్ని నెలలుగా దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా, బ్రాంప్టన్ హిందు దేవాలయంలో ఉన్న హిందువులను టార్గెట్ చేసుకుని ఖలీస్తానీయులు దాడులు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఒక్కసారిగా హిందువులంతా తీవ్ర భయాందోళనలకు గురైనట్లు తెలుస్తొంది. పదే పదే కెనడాలో హిందు దేవాలయాలపై దాడులు మాత్రం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు. అయితే... ఈ చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.
In Canada, fundamentalists attacked Hindu temples, beat up women and children, even before this Hindu temples have been targeted.
The MPs there are saying that our country is not able to protect Hindus!!!!#TrudeausCanada #CanadianTerrorists #Khalistani pic.twitter.com/ikdKNs1VWd— Smile 😍 (@whoamitgaur) November 4, 2024
ఇలాంటి చర్యల్ని మానుకొవాలంటూ కూడా హెచ్చరించినట్లు తెలుస్తొంది. ఈ ఘటనపై కెనడా పీఎం జస్టిస్ ట్రూడో సైతం స్పందించారు. ఇలాంటి చర్యలను కెనడా మద్దతివ్వదంటూ కూడా స్పష్టం చేశారు. అయితే.. కెనడాలో హిందువుల పరిస్థితి మరింత దయానీయంగా మారిందని చెప్పుకొవచ్చు. అక్కడ హిందువుల ఆలయాలు, హిందువుల నివాసస్థలాలపై దాడులు మాత్రం ఆగడంలేదు. కెనడాలో నివసిస్తున్న పౌరులందరూ తమ మత విశ్వాసాలను ఆచరించే స్వేచ్ఛ ఉందని జస్టిస్ ట్రూడో అన్నారు.
బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిరం వద్ద జరిగిన హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదని ట్రూడో తెల్చి చెప్పారు. ఆగంతకులపై వెంటనే చర్యలు తీసుకొవాలని కూడా సోషల్ మీడియాలో డిమాండ్ పెరిగింది. ఈ రోజు కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంపై ఖలిస్తానీ హింసాత్మక రాడికల్స్ దాడి చేశారు.దీన్ని ఇలానే వదిలేస్తే.. హిందువుల మనుగడ కెనడాలో ప్రశ్నర్థకంగా మారిపోతుందని కూడా కొంతమంది ఆందోళనలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.
దేవాలయాలను టార్గెట్ చేసుకుని.. కొన్నిసార్లు దేవాలయాల గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాస్తున్నారు. మరికొన్నిసార్లు దేశ ప్రధాని మోదీ దిష్టిబొమ్మల్ని సైతం కాల్చివేస్తున్నారు. అయితే.. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణం తర్వాత.. ఖలిస్తాన్ మద్దతుదారులు కెనడాలో ఇటువంటి కార్యకలాపాలను ఎక్కువగా చేస్తున్నట్లు తెలుస్తొంది. జూన్ 2023లో బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో నిజ్జర్ కాల్చి చంపబడిన విషయం తెలిసిందే.
ఈ ఏడాదిలో ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత.. లక్ష్మీనారాయణ ఆలయాన్ని టార్గెట్ చేశారు. దాని గేటు, వెనుక గోడపై భారతదేశ వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల పోస్టర్లు అతికించారు. ఈ పోస్టర్ పై హర్దీప్ సింగ్ నిజ్జర్ చిత్రాన్ని కూడా ఉంచిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook