లిక్కర్ డాన్ మాల్యాకు యూకే హైకోర్టులో స్వల్ప ఊరట !!
మాల్యా విషయంలో భారత్ ఆశలపై నీళ్లు చల్లిన యూకే కోర్టు
లిక్కర్ డాన్ విజయ్ మాల్యాకు యూకే హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. బ్యాంకు రుణాలు ఎగ్గొటిన మాల్యాను భారత్ కు అప్పగించేందుకు అంగీకరిస్తూ లండన్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో దిగువ కోర్టు నిర్ణయంపై అప్పీల్ చేసుకునే వెసులుబాటు హైకోర్టు కల్పించింది. తాజా తీర్పుతో తనను భారత్ కు అప్పగించాలన్న కోర్టు ఉత్తర్వులను మాల్యా సవాల్ చేయగలిగే వీలుచిక్కింది.
భారతలోని అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా బ్రిటన్ పారిపోవడం తెలిసిందే. దీంతో అతన్ని తమ దేశానికి అప్పగించాలని భారత ప్రభుత్వం అప్పిల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు .... విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించేందుకు అంగీకరిస్తూ గతంలో తీర్పు వెలువరిచింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ మాల్యా యూకే హైకోర్టును ఆశ్రయించాడు. మాల్యా పిటిషన్ పై విచారణ జరిపిన యూకే కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.