Ukrain-Russia War: అధ్యక్షుడి కుటుంబంలో వార్ చిచ్చు.. విడాకులు తీసుకున్న పుతిన్ కుమార్తె
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఇరు దేశాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ యుద్ధం ఏకంగా రష్యా అధ్యక్షుడు కుటుంబంలో చిచ్చు పెట్టింది. పుతిన్ కూతురు యుద్ధం కారణంగా భర్తతో విడిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Ukrain-Russia War: రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం రోజు రోజు తీవ్రరూపం దాల్చుతుంది. లక్ష్యం నెరవేరే వరకు యుద్ధం ఆపబోమని రష్యన్ అధ్యక్షుడు పుతిన్ అంటుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసేదే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ యుద్ధం కొనసాగిస్తున్నారు.
యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజలు దేశాన్ని విడిచి పొరుగు దేశాలకు వలస వెళుతున్నారు. మరికొంత మంది ఉక్రెయిన్ దేశస్థులు తాము కూడా పోరాటంలో పాల్గొంటామని ఆయుధాలను చేత పట్టారు. ఉక్రెయిన్‌పై పుతిన్ మొదలుపెట్టిన యుద్ధం లక్షలాది మంది జీవితాలను తారుమారు చేసింది. ఉక్రెయిన్‌లో ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. అటు రష్యన్ల జీవితాల్లోనూ పెను ప్రభావం చూపింది.
అంతేకాకుండా, రష్యా దేశానికి ఇతర దేశాల సహాయం నిరాకరించటంతో ఆ దేశంలో దిగుమతులు తక్కువ అవటంతో.. రష్యన్ ప్రజలు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యుద్ధం ఫలితంగా సాధారణ ప్రజలే కాదు... ఏకంగా ఈ సెగ రష్యా అధ్యక్షుడు పుతిన్ కుటుంబానికి తగిలినట్టు సమాచారం.
విషయం ఏమిటంటే.. ఆయన కుమార్తె మరియా వైవాహిక బంధం తెగిపోవడానికి యుద్ధమే కారణమని సమాచారం. డచ్ వ్యాపారవేత్త అయిన జోరిట్ ఫాసెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కుమార్తె మరియాకు భర్త. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజాగా వీరు విడిపోయనట్లు తెలుస్తోంది. పుతిన్ చిన్నదేశమైన ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నప్పటి నుంచి ప్రపంచ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి.
అమెరికా, ఐరోపా దేశాలైతే ఆంక్షలు సైతం విధించాయి. అయినా పుతిన్ వెనక్కు తగ్డడం లేదు. పుతిన్ తీరుపై ఆయన కుటుంబంలోనూ వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే చినికి చినికి గాలివానగా మారి మరియా కుటుంబంలో చిచ్చు పెట్టినట్లు సమాచారం. పుతిన్‌కు మరియా పుతినాతో పాటు యెకటెరీనా పుతినా అనే మరో కుమర్తె కూడా ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook