Supreme Court: కరోనా మృతుల పరిహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం, ఆ నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి

Supreme Court: కరోనా మృతుల పరిహారం విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పరిహారం కోసం దాఖలయ్యే నకిలీ దరఖాస్తులపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 24, 2022, 12:58 PM IST
Supreme Court: కరోనా మృతుల పరిహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం, ఆ నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి

Supreme Court: కరోనా మృతుల పరిహారం విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పరిహారం కోసం దాఖలయ్యే నకిలీ దరఖాస్తులపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది.

కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. కోర్టు తీర్పు నేపధ్యంలో పరిహారం కోసం దరఖాస్తులు వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలో పరిహారం కోసం నకిలీ దరఖాస్తులు కూడా వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. 

కరోనా మృతుల విషయంలో పరిహారం కోసం నకిలీ దరఖాస్తులపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో దాఖలైన 5 శాతం దరఖాస్తులపై సమీక్ష జరగనుంది. అదే సమయంలో కరోనా మృతులకు పరిహారం చెల్లించే గడువును కూడా సుప్రీంకోర్టు 2 నెలలుగా ఖరారు చేసింది. భవిష్యత్తులో ఎదురయ్యే మృతుల పరిహారానికి కూడా 90 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. 

నకిలీ దరఖాస్తులపై దర్యాప్తుకు కేంద్రానికి అనుమతిచ్చిన తరువాత..4 రాష్ట్రాల్లో దాఖలైన 5 శాతం దరఖాస్తులను సమీక్షించనుంది. మరణించినవారి సంఖ్యకు, దరఖాస్తుల సంఖ్యకు మధ్య చాలా అంతరం కన్పించింది. ఈ నేపధ్యంలోనే నకిలీ దరఖాస్తులపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు కేంద్రానికి అనుమతించింది.

Also read: పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ కోసం మంత్రుల పడిగాపులు.. ఇవాళ మధ్యాహ్నం మీటింగ్ ఖారారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News