పాక్ ప్రధానికి అవమానం జరగలేదు: జీఈవో
అమెరికా పర్యటనలో పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాఖన్ అబ్బాసీని విమానాశ్రయ అధికారులు తనిఖీ చేయడంపై పాక్ మీడియా స్పందించింది.
అమెరికా పర్యటనలో పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాఖన్ అబ్బాసీని విమానాశ్రయ అధికారులు తనిఖీ చేయడంపై పాక్ మీడియా స్పందించింది. అబ్బాసీ ప్రవేట్ పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్ళారని.. అటు విమానాశ్రయంలో స్వచ్చందంగా తనిఖీల మార్గంవైపు వచ్చారే తప్ప అధికారులు బలవంతం చేయలేదని ఓ వీడియోను జియో న్యూస్ విడుదల చేసింది. కాగా తమ ప్రధానిని అవమానించారని పాక్ నెటిజన్లు అమెరికాపై మండిపడ్డారు.
అంతకు ముందు పాక్ ప్రధానికి న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైందని వార్తలు వచ్చాయి. సాధారణ పౌరుల మాదిరి పాక్ ప్రధాని ఎయిర్‌పోర్ట్‌లోని సెక్యూరిటీ చెక్స్ అన్నింటినీ దాటుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాకిస్థాన్, అమెరికా మధ్య సంబంధాలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం అంటూ కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే పాక్ ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులకు వీసాలు ఇవ్వకూడదని అమెరికా భావిస్తున్న నేపథ్యంలో ఇటువంటి వార్తలు రావడం గమనార్హం.