Washington DC Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. వాషింగ్టన్‌లో ఆదివారం (జూన్ 19) జరిగిన కాల్పుల ఘటనలో ఒక మైనర్ మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు ధ్రువీకరించారు. జూన్‌టీంత్ సెలబ్రేషన్స్‌లో భాగంగా '14,యూ స్ట్రీట్‌'లో నిర్వహించిన ఓ మ్యూజిక్ ఈవెంట్‌కు సమీపంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాల్పులకు పాల్పడిన నిందితుడి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. 14, యూ స్ట్రీట్‌లో నిర్వహించిన మ్యూజిక్ ఈవెంట్‌కు అనుమతి లేదన్నారు. కాల్పుల్లో గాయపడినవారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.


అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గత నెలలో టెక్సాస్‌లోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటనలో 19 మంది చిన్నారులు మృతి చెందారు. కాల్పులకు పాల్పడింది టీనేజర్ కావడం గమనార్హం. మే 31న న్యూ ఓరియన్స్‌లో జరిగిన మరో కాల్పుల ఘటనలో ఓ వృద్దురాలు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు.


కాల్పుల ఘటనలపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మారణాయుధాలను నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. లేనిపక్షంలో గన్ కొనుగోలు వయసును 18 నుంచి 21కి పెంచడంతో పాటు నిబంధనలను కఠినతరం చేయాల్సి ఉంటుందన్నారు. 




Also Read: Etela Rajender: కోమటిరెడ్డి కారులో ఈటల రాజేందర్.. ఢిల్లీలో ఏం జరిగింది?


Also Read: TS Inter Results 2022 : ఆ రోజే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. tsbie.cgg.gov.inలో వివరాలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook