Bike stunt fail viral video: రోడ్డు మీడ వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాల జరగటం ఖాయం. కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్న అనుకోకుండా ప్రమాదాలు (Road accidents) జరగుతుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాంటిది కొంత మంది మాత్రం కోరి ప్రమాదాలను తెచ్చుకుంటుంటారు. ముఖ్యంగా బైక్​లతో స్టంట్స్ వేయబోయి (Bike stunt failures) ప్రమాదాల బారిన పడిన వారికి లెక్కే లేదు.


ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలు జరిగినా కొంత మందిలో మార్పు రావడం లేదు. ఇలాంటి ఘటనకు సంబంధించి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో (Bike Stunt Viral video) వైరల్ అవుతోంది. ఐపీస్ అధికారిణి రుపిన్ శర్మా ఈ వీడియోను అమె ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.


Also read: Hardship of Life: ప్రపంచం కంట కన్నీరు పెట్టిస్తున్న ఫోటో.. గుండె బరువెక్కించే సన్నివేశం


Also read: US: తొలి 'ఎక్స్‌'’ జెండర్‌ పాస్‌పోర్టు జారీ చేసిన అగ్రదేశం


వీడియోలో ఏముందంటే..


రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఓ బైకర్ ఉన్నట్టుండి.. బైక్​తో స్టంట్లు వేయడం ప్రారంభించాడు. ముందు చక్రాన్ని గాల్లోకి లేపి బైక్​ను ముందుకు పోనివ్వ సాగాడు. కొద్ది క్షణాల్లోనే బైక్​పై నియంత్రణ కోల్కోయాడు ఆ బైకర్​. దీనితో అటుగా వస్తున్న ఓ ట్యాంకర్​ను డీ కొట్టాడు. ఈ ప్రమాదంంలో బైకర్​ దూరంగా ఎగిరి పడ్డాడు. బైక్ కూడా దూరంగా ఎగిరి పడింది.


బైకర్​ వెళ్తున్న మార్గంలోనే ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన కారులోంచి ఈ స్టంట్​ను తన కెమెరాలో బంధించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్​ చేయగా ఇప్పుడది వైరల్​గా మారింది.
అయితే ఈ వీడియో మన దేశానికి సంబంధించినది కాదు. విదేశాల్లో జరిగింది. సరిగ్గా ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? ప్రమాదంలో ఆ యువకుడికి ఏమైంది? అనే వివరాలు కూడా తెలియరాలేదు.




ఈ వీడియోను షేర్ చేసిన ఐపీఎస్​ అధికారిణి రుపిన్ శర్మ.. ఇలాంటి స్టంట్లు ఎవరూ చేయోద్దంటూ ట్విట్టర్​ ద్వారా సూచించారు. సినిమాల్లో హీరోల్లో స్టంట్లు వేయోద్దంటూ సలహా ఇచ్చారు.


Also read: China Taiwan: తైవాన్‌ కచ్చితంగా చైనాలో కలవాల్సిందే ‌‌- చైనా స్టేట్ కౌన్సిలర్ వాంగ్ యీ


Also read: Vaccine For Kids: చిన్నారుల కరోనా టీకాకు అమెరికా ఎఫ్​డీఏ ఆమోదం- 5-11 ఏళ్ల వారికి ఇచ్చేందుకు కసరత్తు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe