Russia -Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఐదో రోజుకు (Russia Ukraine war 5th day) చేరింది. ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై పట్టు కోసం రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.  ఖర్కీవ్, ఖేర్సన్, చెర్నిహివ్‌ వంటి పట్టణాలపై రష్యా (Russia) బాంబుల మోత మోగిస్తోంది. రష్యా బలగాలను ఉక్రెయిన్‌ దళాలు ధీటుగా బదులిస్తున్నాయి. నివాస ప్రాంతాలపై కూడా రష్యా సైన్యం దాడులకు తెగబడుతోంది. రష్యాపై  మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు సిద్దమవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా రాజధాని కీవ్ (Kyiv) వైపు వెళ్తున్న రష్యా ట్యాంకులను వందలాది స్థానికులు చుట్టుముట్టి అడ్డుకున్నారు. ఈ ఘటన చెర్నిహివ్ రీజియన్ లోని కొర్యుకివ్కా పట్టణ శివార్లలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకు అప్ లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే 1,35000 వీక్షణలు, 2000 లైక్‌లు మరియు 800 రీట్వీట్‌లు వచ్చాయి. 




ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో భాగంగా ఇప్పటివరకు 102 మంది సామాన్య పౌరులు మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి (UNO) తాజాగా వెల్లడించింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు ప్రకటించింది. పశ్చిమ దేశాల ఆంక్షలతో.. సోమవారం రష్యా కరెన్సీ రూబుల్‌ విలువ భారీగా పతనమైనట్లు తెలుస్తోంది. దీంతో రూబుల్ పతనాన్ని  అడ్డుకునేందుకు రష్యా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 9.5 శాతంగా ఉన్న బ్యాంకు రేటును ఒక్కసారిగా 20 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 


Also Read: Russia Ukraine War: బెలారస్ వేదికగా చర్చలకు సిద్ధమైన రష్యా, ఉక్రెయిన్... యుద్ధానికి తెరపడేనా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి