Russia Ukraine War: రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ సిద్ధమైంది. బెలారస్ వేదికగా రష్యా ప్రతినిధి బృందంతో చర్చలు జరపనుంది. ఇప్పటికే రష్యా ప్రతినిధి బృందం బెలారస్ చేరుకుంది. రష్యా బృందానికి నేత్రుత్వం వహిస్తున్న వ్లాదిమిర్ మెదిన్‌స్కీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఉక్రెయిన్-బెలారస్ సరిహద్దులోని గోమెల్ ప్రాంతంలో చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.
రష్య ప్రతినిధి బృందంలో ఒకరైన దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బెలారస్‌లో ఉక్రెయిన్ ప్రతినిధి బృందం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ బృందం ప్రయాణించే మార్గం 100 శాతం సురక్షితమని తాము గ్యారెంటీ ఇస్తున్నామన్నారు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో మాట్లాడారని.. ఉక్రెయిన్ చర్చలకు సిద్దంగా ఉందని రష్యాకు సమాచారమిచ్చారని తెలిపారు.
అంతకుముందు, బెలారస్ వేదికగా రష్యాతో చర్చలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తిరస్కరించారు. బెలారస్‌కి బదులు బుడాపెస్ట్, వార్సా, ఇస్తాంబుల్ లేదా ఇతర నగరాల్లో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. తాము శాంతిని కోరుకుంటున్నామని.. అయితే బెలారస్ కాకుండా ప్రత్యామ్నాయ వేదికను కోరుకుంటున్నామని చెప్పారు. అయితే ఆ తర్వాత మనసు మార్చుకున్న జెలెన్ స్కీ బెలారస్ వేదికగానే చర్చలకు సిద్ధమయ్యారు. తాజా చర్చలతో ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి తెరపడుతుందన్న ఆశలు రేకెత్తుతున్నాయి.
ఒకప్పుడు సోవియెట్ రష్యాలో భాగమైన రష్యా పొరుగు దేశం ఉక్రెయిన్.. ఇప్పుడు పశ్చిమ దేశాలు, నాటోకి దగ్గరవుతుండటం రష్యాకు మింగుడుపడట్లేదు. ఈ నేపథ్యంలోనే రష్యా ఉక్రెయిన్‌పై గత నాలుగు రోజులుగా భీకర దాడులకు పాల్పడుతోంది. యుద్ధం కారణంగా ఇప్పటికే వందలాది మంది సాధారణ పౌరులు మృతి చెందారు. యుద్ధానికి తెరపడాలని ప్రపంచమంతా ఆకాంక్షిస్తున్న వేళ తాజా చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read: Corona Fourth Wave: జూన్ నుంచి కరోనా ఫోర్త్‌వేవ్, ఆగస్టులో పీక్స్, కాన్పూర్ ఐఐటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook