Whiskey Bottle Auction: ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బాటిల్ వేలం ప్రక్రియ పూర్తయ్యింది. దాదాపుగా 5 అడుగుల 11 అంగుళాల పొడవు ఉన్న ఈ సీసాలో 311 లీటర్ల విస్కీని నింపి ఉంది. ఈ విస్కీ బాటిల్ ను ఇటీవలే ఆన్ లైన్ లో వేలానికి ఉంచగా.. అందులో భారీ ధరకు అమ్ముడుపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాదాపుగా 5 అడుగుల 11 అంగుళాల పొడవు.. 311 లీటర్ల స్కాచ్ విస్కీ  ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలిచింది. అయితే ఈ అతిపెద్ద విస్కీ బాటిల్ ధర సుమారు 1.4 మిలియన్లు డాలర్లు అంటే సుమారుగా రూ. 10,85,88,900 ఉంటుంది. దీన్ని వేలానికి ఉంచారు. 


విస్కీకి ఇంట్రెపిడ్ బ్రాండ్ పేరు పెట్టినట్లు వేలం కంపెనీ తెలిపింది. ఇది ఒకే మాల్ట్.. దాదాపు 32 సంవత్సరాల కాలం నాటి విస్కీ బాటిల్. దీన్ని 1989లో స్పైసైడ్ ప్రతిష్టాత్మకమైన ది మకాలన్ నెలకొల్పగా.. సెప్టెంబర్ 2021లో విస్కీని నింపి గిన్నిస్ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఈ బాటిల్‌లో దాదాపు 444 విస్కీ బాటిళ్లతో సమానమైన ఆల్కహాల్ ఉన్నట్లు సమాచారం.


Also Read: US SHOOTING: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. మహిళ మృతి, ఏడుగురికి గాయాలు


Also Read: Nepal Plane Crash: జీపీఎస్‌ ఆధారంగా క్రాష్‌ అయిన నేపాల్‌ విమానం ఆచూకీ గుర్తింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook