Nepal Plane Crash: నేపాల్ లో ఆదివారం మిస్ అయిన 9N-AET అనే విమానం ఆచూకి లభ్యమైంది. నేపాల్ ఆర్మీ అధికారులు భావించినట్టుగానే ఆ ప్లేన్ క్రాష్ అయింది. ఈ విమాన శకలాలను ముస్తాంగ్ జిల్లాలోని కోవంగ్ ప్రాంతంలో గుర్తించారు. 43 సంవత్సరాల విమానాన్ని నేపాల్ కు చెందిన ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్ ఆపరేట్ చేస్తోంది. రెండు ఇంజిన్ లు కలిగిన ఈ విమానం ఆదివారం టేకాఫ్ అయిన 12 నిమిషాలకు రాడార్ తో సంబంధం తెగిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన నేపాల్ ఆర్మీ, ఏవియేషన్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. మంచు తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఆదివారం పూర్తిస్థాయిలో రెస్క్యూ చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో ఉదయమే ఆర్మీ అధికారులు మరోసారి రంగంలోకి దిగారు. లంచే నదికి ఎగువన మనపతి హిమల్ ప్రదేశంలో క్రాష్ అయినట్టు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను కూడా విడుదల చేశారు.
నేపాల్ ఆర్మీ హెలికాప్టర్ లో పది మంది సైనికులు, సివిల్ ఏవియేషన్ అథారిటీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. సెల్ ఫోన్ ఆధారంగానే నేపాల్ టెలికామ్ అథారిటీ క్రాష్ అయిన విమానం ఆచూకిని గుర్తించింది. క్రాష్ అయిన విమానం కెప్టెన్ ప్రభాకర్ ఫోన్‌కు కాల్ చేశారు. ఫోన్ రింగ్ అవుతుండటంతో వెంటనే ఆ సిగ్నల్ ను జీపీఎస్ ఆధారంగా కనుగొన్నారు. అప్పటికే క్షేత్రస్థాయిలో పర్వతాల్లో జల్లెడ పడుతున్న ఆర్మీ అధికారులకు టెలికామ్ అథారిటీ అధికారులు.. ఆ సిగ్నల్ సమాచారం అందించారు.
Nepal | Crashed Tara Air aircraft located at Sanosware, Thasang-2, Mustang
The aircraft with 22 people including four Indians onboard went missing yesterday.
(Photo source: Nepal Army) pic.twitter.com/W4n5PV3QfA
— ANI (@ANI) May 30, 2022
పోక్‌రా నుంచి ఆదివారం ఉదయం 9 గంటల 55 నిమిషాలకు టేకాఫ్ అయిన విమానం.. షెడ్యూల్ ప్రకారం 10 గంటల 15 నిమిషాలకు జోమ్‌సన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ ఈలోగా.. టేకాఫ్ అయిన 12 నిమిషాలకు అంటే.. 10 గంటల 7 నిమిషాలకు విమానం రాడార్ సిగ్నల్ నుంచి మిస్ అయింది. క్రాష్ అయిన విమానంలో మొత్తం 22 మంది ఉన్నారు. ఇందులో నలుగురు భారతీయులు, ఇద్దరు జర్మన్లు, 13 మంది నేపాలీ ప్యాసింజర్లు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు.
Also Read: ATTAK ON MALLAREDDY: రెడ్డి సింహ గర్జనలో ఏం జరిగింది? మంత్రి మల్లారెడ్డిపై దాడి చేసిందెవరు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook