Murder case on alia Fakhri nargis fakhris sister: సాధారణంగా ఎవరికైన కొంత మందిని చూస్తే ఒకరకమైన ఫీలింగ్స్ కల్గుతాయి. అమ్మాయిలు లేదా అబ్బాయిలు కాలేజీ డేస్ లలో ప్రేమించుకున్న ఘటనలు చూస్తుంటాం. కానీ కొంత మంది ప్రేమ ప్రపోజ్ కు ఓకే చేప్తుంటారు. కానీ కొంత మంది ప్రేమను రిజెక్ట్ కూడా చేస్తుంటారు. ఈ క్రమంలో కొంత మంది కొన్నిరోజులు బాధపడి.. తర్వాత తమ లైఫ్ లో బిజీగా మారిపోతుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ కొంత మంది మాత్రం.. కొన్నిరోజులు ప్రేమలో ఉండి.. డేటింగ్ చేసి అడ్డమైన తిరుగుళ్లు తిరిగి తీరా.. అన్ని అయిపోయాక.. బ్రేకప్ లు చెప్పుకుంటారు. ఈ క్రమంలో ఇలాంటి పరిస్థితుల్లో కొందరు సైకోలుగా మారుతుంటారు. తమను బ్రేకప్ చెప్పిన వాళ్ల మీద ఎలాగైన రివేంజ్ తీర్చుకొవాలని రకరకాల ప్లాన్ లు వేసుకుంటారు. కొన్ని సార్లు ఈ ఘటనలు హత్యల వరకు కూడా వెళ్తుంటారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


బాలీవుడ్ నటి.. నర్గీస్ ఫక్రీ సోదరి.. అలియా ఒక హత్య కేసులో ఇరుక్కుంది. ఆమెను న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తొంది. ఆమె గత నెల తన బాయ్ ఫ్రెండ్, అతని కొత్తప్రియురాలు ఉన్న ఇంటిని పెట్రోల్ పోసి నిప్పంటించిందంట. ఆ తర్వాత చుట్టుపక్కల వారు తెరుకుని.. వారికి చెప్పేవరకు ఇల్లంతా నిప్పులు అంటుకున్నాయి. మంటల్లో వారు సజీవదహన మైనట్లు తెలుస్తొంది. దీంతో అప్పటి నుంచి పోలీసులు విచారణ చేపట్టారంట.


అయితే.. ఆలియాకు.. ఎడ్వర్డ్ జాకోబ్ తో డేటింగ్ లో ఉందంట. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారంట. ఆ తర్వాత ఎడ్వర్డ్..అనాస్టాసినాయా ఎటీనీ అనే యువతితో సన్నిహితంగా ఉంటున్నాడంట. వీరిద్దిరి గురించి తెలుసుకుని .. ఆలియా పలుమార్లు ఎడ్వర్డ్ ను హెచ్చరించిందంట. ఈ నేపథ్యంలో నవంబరు 2న వీరు ఒక ఇంట్లో ఉన్నారని విషయం తెలుసుకుని.. అక్కడకు వెళ్లి భవంతికి వెళ్లి నిప్పుపెట్టిదంట.


Read more: Viral Video: వామ్మో.. శివయ్యల మారిన వానరం.. మెడలో కింగ్ కోబ్రాతో హల్ చల్.. వీడియో ఇదిగో..


చుట్టుపక్కల వారు.. చాలాసేపటి తర్వాత దీన్ని గమనించారంట. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయిందంట.  అక్కడున్న వారు.. ఆలియా ఫక్రీని చూశారంట. ఈ మేరకు పోలీసులు.. తాజాగా, ఆలియా ఫక్రీని అరెస్ట్ చేశారు. దీనిపై బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ మాత్రం ఇప్పటి వరకు స్పందించినట్లు లేదు. కానీ రెండు నిండు ప్రాణాలు తీసిన అలియా సైకోయిజంను అక్కడి వారు తిట్టిపోస్తున్నారు. ఆమెకు జీవితఖైదు పడే అవకాశం ఉందని అంటున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.