#COVID19: కరోనా వైరస్‌కు అధికారికంగా పేరు పెట్టిన WHO
#COVID19 ఇప్పటికే వెయ్యి మంది ప్రాణాలు బలిగొన్న ప్రాణాంతక కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా COVID-19 అని నామకరణం చేసింది.
ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక వైరస్ కరోనా పేరును ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్చింది. కరోనావైరస్‌కు కోవిడ్-19 (covid-19) అని డబ్లూహెచ్‌వో నామకరణం చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో కరోనాను తాము పెట్టిన పేరును ట్వీట్ చేసింది. ఇప్పటివరకూ ఎన్‌కోవ్-2019 (nCoV-2019) గా ఉన్న కరోనా వైరస్‌కు అధికారికంగా covid-19 అని నామకరణం చేసినట్లు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అదానోమ్ గేబ్రేయేసస్ తెలిపారు.
చైనా దేశంలో పుట్టుకొచ్చిన ప్రమాదకర వైరస్ బారిన పడి ఇప్పటికే వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. 42000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రభావం 20కి పైగా దేశాల్లో ఉంది. కరోనా అనేది కొన్ని వైరస్‌ల సమూహాన్ని సూచిస్తుందని, గందరగోళాన్ని తొలగించేందుకు మెడికల్ రీసెర్చర్స్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే కరోనాకు నామకరణం చేసినట్లు అదానోమ్ తెలిపారు.
కాగా, పుట్టినప్పుడు పిల్లల మాదిరిగానే ఓ పేరు పెట్టారని, ఇప్పుడు అధికారికంగా ప్రాణాంతక వైరస్‌కు నామకరణం చేస్తున్నట్లు వివరించారు. కోవిడ్-19 (COVID-19) పూర్తి అర్థం ( co- corona, vi- virus, D- disease), 2019లో పుట్టుకొచ్చింది కనుక 19 జత చేసినట్లు చెప్పారు.