Corona Alert: వదిలేస్తే...మరణ మృదంగమే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. వైరస్ తీవ్రతపై అప్రమత్తంగా ఉండకపోతే సమీప భవిష్యత్ లో మరణమృదంగం మోగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) మరోసారి హెచ్చరిక జారీ చేసింది. వైరస్ తీవ్రతపై అప్రమత్తంగా ఉండకపోతే సమీప భవిష్యత్ లో మరణమృదంగం మోగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
కరోనా వైరస్ తీవ్రత ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. అన్ లాక్ ప్రక్రియ ( Unlock process ) తో చాలా దేశాల్లో గతంలో ఉన్నంత సీరియస్ ఇప్పుడు కన్పించడం లేదు. బహుశా ఈ కారణంగానే కరోనా వైరస్ సంక్రమణ పెరుగుతోంది. కొన్ని దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World health organisation ) అధికారులు ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీ చేశారు. అన్నిదేశాలు కలిసి సమిష్టిగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరణాల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ వో అధికారులు తెలిపారు. అదేవిధంగా కరోనా వైరస్ కట్టడి కోసం వాక్సిన్ అవసరంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సత్వర చర్యలు లేకపోయినా వాక్సిన్ రాకపోయినా మరణాల తీవ్రత పెరుగుతుందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య పది లక్షలకు చేరువలో ఉంది. ఇప్పుడీ సమయంలో అప్రమత్తం కాకుంటే..మరణాల సంఖ్య 20 లక్షలకు చేరుతుందనేది డబ్ల్యూహెచ్ వో ఎమర్జన్సీస్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ హెచ్చరిస్తున్నారు. వైరస్ కారణంగా ఎదురయ్యే ప్రమాదం ఊహించడమే కష్టంగా ఉందని అన్నారు.
ఇండియాలో కరోనా వైరస్ మరణాల ( coronavirus deaths in india ) సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే తక్కువే ఉందనేది తాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 85 వేల 362 కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 59 లక్షలు దాటింది. కరోనా వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకూ 93 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి కారణంగా మరణించినవారి సంఖ్య 9 లక్షల 88 వేలకు చేరుకోగా..మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 25 లక్షలు దాటింది. Also read: Sputnik v vaccine: శుభవార్త చెప్పిన రష్యా, అందుబాటులో వ్యాక్సిన్