World Ocean Day 2023: ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ప్రాముఖ్య తెలుసుకోండి!
World Ocean Day 2023 Theme: ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. ఈ రోజు ప్రభుత్వాలు సముద్రం వల్ల కలిగే ప్రయోజనాలేంటో గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా థీమ్‌ను కూడా విడుదలు చేస్తారు.
World Ocean Day 2023 Theme: సముద్రాలు భూమికి ఊపిరితిత్తులు లాంటివి.. ఎందుకంటే భూమి నుంచి వచ్చే కాలుష్యాన్ని పిల్చుకుని మంచి గాలిని అందిస్తాయి. అందుకే శాస్త్రవేత్తలు భూమికి సంముద్రాలను అవయవాలుగా భావిస్తారు. అంతేకాకుండా సముంద్రపు నీటి కారణంగా భూమిపై పంటులు పండుతున్నాయి. అందుకే వీటిని అతి పెద్ద వనరులుగా కూడా భావిస్తారు. మానవు సముద్రానికి ఎంత దూరం జీవించిన..మానవ జీవితం మాత్రం సముద్రాలపై ఆదార పడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అన్ని దినోత్సవాలకు ఒక్కొక్క రోజును కేటాయించారు. ఈ సముద్ర దినోత్సవాన్ని కూడా ప్రతి సంవత్సరం జూన్ 8 న జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. అంతేకాకుండా ఈ సంస్థ ప్రతి సంవత్సరం మహా సముద్రాలకు సంబంధించిన థీమ్‌లను కూడా విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం థీమ్ ఎంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
థీమ్ ఇదే:
ప్రపంచ మహాసముద్ర దినోత్సవానికి సంబంధించిన థీమ్‌ను ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. అయితే ఈ సంవత్సరం.. "ఓషన్ ప్లానెట్.. వేవ్స్ మారుతున్నాయి." అనే థీమ్‌ను UNO విడుదల చేసింది.
మహాసముద్రాల విస్తీర్ణం:
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహాసముద్రాలకు ప్రాముఖ్యత ఉంది. ఆధునికత కారణంగా సాంకేతికత పెరుగుతున్న చాలా మందికి సముద్రాలపై అవగాహన లేకుండా పోతోంది. ప్రస్తుతం మహాసముద్రాలు భూమి ఉపరితలంలో 70 శాతం ఆక్రమించాయి. అంతేకాకుండా భూమిలో సగం ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది. సముద్రాల వల్ల భూమికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి.
Also Read: Surya Nakshatra 2023: రాహు నక్షత్రంలోకి సూర్యుడు.. ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసా?
మానవులకు సముద్రం వల్ల కలిగే ప్రయోజనాలు:
ప్రస్తుతం భూమిపై జీవించే చాలా మంది ఆహారం కోసం సముద్రాలపై ఆధారపడుతున్నారు. ప్రపంచంలోని ఒక బిలియన్ కంటే ఎక్కువ మందికి సముద్రం నుంచి వివిధ రూపాల్లో ప్రోటీన్ లభిస్తోంది. 2030 నాటికి సముద్ర ఆధారిత పరిశ్రమల కారణంగా 40 మిలియన్ల మందికి ఉపాధి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సముద్రాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
మహాసముద్రాల ప్రాధాన్యత:
వాయు కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రాలపై చాలా ఒత్తిడి పెరుగుతోంది. సహజ ప్రక్రియలు ప్రభావితమైతే.. సముద్రాల కారణంగా మానవులపై తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. సముద్రాల వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాతావరణంలో కాలుష్యం శాతాన్ని తగ్గించాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది.
Also Read: Surya Nakshatra 2023: రాహు నక్షత్రంలోకి సూర్యుడు.. ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook