చైనాలో తొలి హైడ్రోజన్ ట్రామ్ సేవలు ప్రారంభం
పర్యావరణాన్ని రక్షించండం అందరి భాద్యత. అందుకేనేమో ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలతో ముందుండే చైనా.. ఈసారి కూడా మరో కొత్త ఆవిష్కరణతో వార్తల్లో నిలిచింది. ఆ ఆవిష్కరణ పేరు హైడ్రోజన్ ట్రామ్. చూడటానికి ఎంచక్కా రైలు మాదిరి కనిపించే ఈ ట్రామ్ లో మూడు బోగీలు ఉంటాయి. అందులో కూర్చోవడానికి 66 సీట్లు ఉంటాయి. ఈ ట్రామ్ తో చైనా ప్రజారవాణా వ్యవస్థలో మరో ముందడుగు వేసిందనే చెప్పవచ్చు.
ప్రపంచంలో హైడ్రోజన్ తో నడిచే తొలి పర్యావరణ ట్రామ్ గా రికార్డుల్లోకి ఎక్కింది ఈ రైలు. 12 కేజీల హైడ్రోజన్ ను ఒకేసారి నింపుకొనే సామర్థ్యం ఉన్న ఈ ట్రామ్ గంటకు 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ హైడ్రోజన్ ట్రామ్ ను ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్ లోని తంగ్షన్ లో వాణిజ్య సేవల కోసం అందించనున్నారు.