Bisaccia City: సొంతిళ్లు కావాలనుకుంటున్నారా..అదికూడా అందమైన నగరంలో. అన్ని వసతులతో కూడిన ఆ ప్రాంతంలో ఇళ్లు ఇప్పుడు చాలా చౌకగా లభిస్తున్నాయి. నిజమే. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నాలుగు సిగరెట్ల ధరకే ఇళ్లు లభించేస్తుంది. వివరాలేంటో చూడండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుత రోజుల్లో సొంత ఇంటిని కలిగి ఉండటమనేది చాలా ఖరీదుగా మారింది. మారుమూల గ్రామంలో కూడా ఇళ్లు కొనుగోలు చేయలేని పరిస్థితులున్నాయి. అటువంటిది ఆ దేశంలో మాత్రం అత్యంత చౌకగా ఇళ్లు లభిస్తున్నాయి. ఎంత చౌకగా అంటే..మీరు ఖర్చు పెట్టే నాలుగు సిగరెట్ల ధరకే ఇళ్లు లభిస్తాయి. ఆశ్చర్యంగా అన్పిస్తున్నా ముమ్మాటికీ నిజమిది. సాక్షాత్తూ అక్కడి ప్రభుత్వమే ఈ ఇళ్లను మీకు విక్రయిస్తుంది కాబట్టి ఇందులో మోసం, దగా అనేవి ఉండవు. 


నాలుగు సిగరెట్లు లేదా మూడు పాలప్యాకెట్ల ధరకు ఇళ్లు లభించడమేంటనుకోకండి. అత్యంత అందమైన ప్రాంతంలో అది కూడా. అందమైన దేశంగా, టూరిస్ట్ ప్రాంతంగా పేరున్న ఇటలీలోని(Italy) బిసాసియా నగరం గురించి జరుగుతున్న ప్రొమోషన్ ఇది. రోమ్(Rome) నగరానికి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరం. ఒకప్పుడు నిత్యం ప్రజలతో కళకళలాడిన పురాతన నగరం ఇది. 1968లో సంభవించిన భూకంపంతో చాలామంది ప్రజలు ఇతర పట్టణాలకు వలస వెళ్లిపోయారు. ఫలితంగా బిసాసియా నగరం(Bisaccia City)దాదాపుగా ఖాళీ అయింది. ఈ నగరంలో ఎక్కడ చూసినా ఖాళీ ఇళ్లే దర్శనమిస్తాయి. ఇంతటి ప్రాచీన నగరం, అందమైన నగరం ఇలా బోసిపోవడంతో..ప్రభుత్వం ఓ సవాలుగా తీసుకుంది. అందుకే ఈ నగరంలోని ఇళ్లను అత్యంత చౌకగా వేలంలో విక్రయించేందుకు సిద్దమైంది. కేవలం ఒక్క యూరోకే ఇళ్లు మీ సొంతం చేసుకోవచ్చు. అంటే ఇండియన్ కరెన్సీలో కేవలం 87 రూపాయలు. అంటే మీరు ఖర్చుపెట్టే నాలుగు సిగరెట్ల ధర లేదా మూడు పాలప్యాకెట్ల ధరకే సొంతిళ్లు వచ్చేస్తుంది. ప్రాచీన నగరం కావడంతో ఇళ్లన్నీ దగ్గర దగ్గరగా చిన్న చిన్నరోడ్లతో ఉంటాయి. ఇక్కడ ఇంత చౌకగా ఇళ్లు కొనుగోలు చేయాలంటే ప్రభుత్వంతో ఓ ఒప్పందం చేసుకోవల్సి ఉంటుంది. 


శిధిలావస్థకు చేరుకున్న ఇంటిని కొనుగోలు చేసుకున్నవారే మరమ్మత్తులు చేయించుకోవాలి. కొత్త ఇళ్లలా తీర్దిదిద్దుకోవాలి. కొనుగోలు చేసిన మూడేళ్లలోగా తప్పనిసరిగా ఇంటిని పునరుద్ధరించుకోవాలి. దీనికోసం ఒప్పందంలో 5 వేల యూరోలు డిపాజిట్ చెల్లించాలి. ఇంటి పునర్నిర్మాణం జరిగిన తరువాత డిపాజిట్ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి ఇచ్చేస్తుంది. అదే ఇంట్లో నివాసం ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇంటిని కొత్త ఇంటిలా తీర్దిదిద్దుకుంటే చాలు. ఈ ఆఫర్ ఎంతమందికి నచ్చుతుందో తెలియదు కానీ..అత్యంత చౌక ధర(House at Cheaest price) ఇదే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకరు ఒకటి కంటే ఎక్కవ వేలంపాటల్లో పాల్గొనవచ్చు కూడా. మీక్కూడా అక్కడ ఇళ్లు కొనుగోలు చేసుకోవాలనుంటే..వెంటనే త్వరపడండి మరి. 


Also read: Joe Biden on Afghan: ఆఫ్ఘన్ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ సరైందేనా, బిడెన్ ఏమంటున్నారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook