Srisailam reserviour gates opened: హైదరాబాద్‌ : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నిన్నటివరకు 3 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ వచ్చిన అధికారులు.. నేడు మరో ఏడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కృష్ణానది పరీవాహక ( Krishna river ) ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న వర్షాల కారణంగా నదిలోకి వస్తున్న వరద నీరు శ్రీశైలం రిజర్వాయర్‌కి మళ్లుతోంది. ప్రస్తుతం జలాశయానికి 68,901 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులకి చేరుకుంది. దీంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. Also read : Gunda Mallesh Dies: మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ కన్నుమూత..



శ్రీశైలం ప్రాజెక్ట్ ( Srisailam project ) పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 214.8540 టీఎంసీల మేర నీరు ఉంది. ప్రాజెక్టు నిండా నీరు ఉండటంతో అధికారులు 10 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,10,874 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. Also read : Vijayawada Landslide: ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండ చరియలు