ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ చేతుల మీదుగా పరీక్షల షెడ్యూల్  రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పరీక్షల దరఖాస్తుల గడువు ఈ నెల 7 చివరి తేదీగా పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2 వేల 833 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 91 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు గుర్తింపుచామని ఇలాంటి పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే విద్యార్ధులు హాల్ టికెట్లను సంబంధిత వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకొవచ్చు మంత్రి గంటా శ్రీనివాస్ రావు తెలిపారు. 


ముఖ్యాంశాలు: 
* మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు
* పరీక్షలు జరిగిన నెల రోజులకే ఫలితాలు విడుదల
* పరీక్షలను మొత్తం 6.10 లక్షల మంది దరఖాస్తులు
* 2 వేల 833 కేంద్రాల్లో పరీక్షలు
* 91 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు గుర్తింపు
* పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు
* మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్ఠ చర్యలు 
* వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొవచ్చు