Prabhas: స్టార్ హీరోయిన్ తో ప్రభాస్ వెకేషన్.. షర్ట్ తీసేసి మరి..!

Prabhas vacation photos: ప్రభాస్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు.. అవసరం లేదు. పేరుకి పాన్ ఇండియా స్టార్ హీరో అయినప్పటికీ కూడా.. ఎంతో అనుకువగా ఉంటారు ఈ హీరో. ఎదిగిన ఒదిగి ఉండాలి అనే తత్వం ఉన్నది. అంతేకాకుండా తన చుట్టూ వారితో కూడా చాలా తక్కువగా మాట్లాడుతారు అనే కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ప్రభాస్ ఒక హీరోయిన్తో వెకేషన్ కి వెళ్లారని.. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ అవుతున్నాయి.  
 

1 /6

తెలుగు హీరోలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్. అడుగుపెట్టింది కృష్ణంరాజు వారసుడిగానే అయినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభిమానులను సంపాదించి పెట్టుకున్నారు.  

2 /6

 ప్రస్తుతం తెలుగులో అత్యంత మార్కెట్ ఉండే హీరో ఎవరంటే.. తప్పకుండా ముందుగా వినిపించే పేరు ప్రభాస్. ఇక బాహుబలి తర్వాత కొన్ని ఫ్లాపులతో సతమతమైన ఈ హీరో.. ఈ మధ్యనే మరోసారి సలార్, కల్కి సినిమాతో వరస విజయాలు అందుకున్నాడు.    

3 /6

ఇక ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రానున్న ది రాజా సాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా కాకుండా సీతారామం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నారు ప్రభాస్.  

4 /6

ఈ క్రమంలో ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కూడా ఒక చిన్న పాత్రలో కనిపించనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. మృణాల్ తో ప్రభాస్ వెకేషన్ కి వెళ్లారు అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఏకంగా వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ అవుతున్నాయి.  

5 /6

అయితే ఇవన్నీ కూడా.. ఏఐతో జనరేట్ చేసిన ఇమేజెస్ అన్నీ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ ఫోటోలన్నీ కొంతమంది ఆకతాయిలు షేర్ చేస్తూ.. ప్రభాస్ హీరోయిన్ తో వెకేషన్ కి వెళ్లారు.. అది కూడా షర్ట్ లేకుండా అన్నీ కామెంట్లు పెడుతున్నారు.  

6 /6

గతంలో ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారు అని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులు కృతి సనన్.. ప్రభాస్ ప్రేమించారు అనే వార్తలు కూడా వినిపించాయి. ఇక ఇప్పుడు ఏకంగా ఏ ఐ జనరేటర్ పిక్స్ పెట్టి.. ప్రభాస్ మృణాల్ తో తిరుగుతున్నారు అని అనవసరమైన రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఏఐ ఇమేజెస్ మీద ఎంతోమంది తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.